అల్యూమినియం పాత్రలలో వంట చేసేవాళ్లకు షాకింగ్ న్యూస్.. ఎంత ప్రమాదమో తెలుసా?

మన ఇళ్లలో ఎక్కువమంది ఉపయోగించే వంట పాత్రలలో అల్యూమినియం పాత్రలు ఎక్కువగా ఉంటాయి. తక్కువ ఖర్చుతో అల్యూమినియం పాత్రలు లభిస్తాయి కాబట్టి వీటిని కొనుగోలు చేయడానికి ఎక్కువమంది ఆసక్తి చూపిస్తారు. అయితే అల్యూమినియం పాత్రలను వాడటం వల్ల తాత్కాలికంగా ఎలాంటి ఇబ్బందులు లేకపోయినా దీర్ఘకాలంలో ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. పూర్వకాలంలో వంటల కోసం మట్టి పాత్రలను ఎక్కువగా వినియోగించేవారు.

ఎవరైతే అల్యూమినియం పాత్రలలో ఆహారాన్ని తరచూ తీసుకుంటారో వాళ్ల శరీరం బలహీనపడే అవకాశాలు అయితే ఉంటాయి. మన శరీరంలో అల్యూమినియం ఎక్కువగా చేరితే జ్ఞాపకశక్తిపై చెడు ప్రభావం పడే అవకాశాలు అయితే ఉంటాయి. అల్యూమియం పాత్రల తయారీలో వినియోగించే ఇతర లోహాల వల్ల కూడా శరీరానికి హాని కలిగే అవకాశాలు అయితే ఉంటాయి.

అల్యూమినియం పాత్రలలో వండిన వంటకాలను తీసుకోవడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అల్యూమినియం వల్ల మెదడుపై చెడు ప్రభావం పడే అవకాశాలు ఉంటాయి. అల్యూమినియం పాత్రలను కొనుగోలు చేసినా ప్రముఖ కంపెనీలకు సంబంధించిన ఉత్పత్తులను మాత్రమే కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అల్యూమినియం పాత్రలకు బదులుగా వంటకాల కోసం ఇనుప స్కిల్లెట్ ఉపయోగించాల్సి ఉంటుంది.

ఇనుప పాత్రలో ఉపయోగించిన తర్వాత ఉడికించిన వంటకాలను మరో పాత్రలోకి తీసుకోవాల్సి ఉంటుందని చెప్పవచ్చు. అల్యూమినియం పాత్రలను వాడే వాళ్లు ఈ విషయాలను గుర్తుంచుకుంటే మంచిది. అల్యూమినియం పాత్రలలో వండినా ఆ వంటలను ఎక్కువ సమయం పాటు నిల్వ చేయకూడదు. అల్యూమినియం పాత్రలలో తరచూ వండేవాళ్లు ఈ విషయాలను గుర్తుంచుకోవాలి.