40 ఏళ్ల దాటిన వాళ్లకు ఈ సమస్య వచ్చే రిస్క్ ఎక్కువట.. జాగ్రత్త పడాల్సిందేనా?

ప్రస్తుత కాలంలో వయస్సుతో సంబంధం లేకుండా చాలామందిని ఎన్నో ఆరోగ్య సమస్యలు వేధిస్తున్నాయి. మైయోపియా లేదా హ్రస్వదృష్టి అనే సమస్య చిన్న సమస్యలా అనిపించినా ఈ సమస్య వల్ల రిస్క్ ఎక్కువగా ఉంటుందని చెప్పవచ్చు. ఎవరైతే ఈ సమస్యతో బాధ పడుతూ ఉంటారో వాళ్లు దూరంలో ఉన్న వస్తువు సరిగ్గా కనిపించకపోవడం వల్ల ఇబ్బందులు పడుతుంటారు.

జీవనశైలి మార్పులు, కళ్లద్దాల వినియోగం, రెగ్యులర్ చెకప్‌లతో చూపును కొంతవరకు కాపాడుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. కాంతి తరంగాలు సరిగ్గా రెటీనాపై పడేలా చేయడంలో కంటి లెన్స్, కనుగుడ్డు పాత్ర ముఖ్యమనే సంగతి తెలిసిందే. హ్రస్వ దృష్టి ఉన్న వారిలో కంటి నిర్మాణంలో స్వల్ప లోపం తలెత్తడం వల్ల దూరాన ఉన్న వస్తువుల నుంచి వచ్చే కాంతి కిరణాలు నేరుగా రెటీనాపై పడే అవకాశాలు అయితే ఉండవని చెప్పవచ్చు.

చత్వారం వచ్చినప్పుడు లెన్స్‌కు సాగేగుణం తగ్గుతుందని చెప్పవచ్చు. అందువల్ల కన్ను సైతం కిరణాలను సరిగ్గా ఫోకస్ చేసే అవకాశాలు అయితే ఉండవు. అదే సమయంలో దూరాన ఉన్న వస్తువులు బాగా కనిపిస్తున్నట్టు భావన కలిగే అవకాశాలు ఉంటాయని చెప్పవచ్చు. ఎప్పటికప్పుడు కంటి పరీక్షలు చేయించుకుంటూ వైద్యుల సూచనలు పాటిస్తూ ఉంటే చత్వారం ఉన్నా జీవితంలో పెద్ద ఇబ్బందులు పడే ఛాన్స్ ఉండదు.

చిన్నచిన్న ఆరోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేస్తే ఆ సమస్యలు పెద్ద సమస్యలుగా మారే అవకాశం అయితే ఉంటుంది. 40 ఏళ్ల దాటిన వాళ్లకు ఈ సమస్య వచ్చే రిస్క్ ఎక్కువ ఉండటంతో రిస్క్ ఎక్కువ ఉన్నవాళ్లు జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని చెప్పవచ్చు.