రాత్రి పడుకునేటప్పుడు కూడా సాక్సులు వేసుకొని పడుకుంటున్నారా… అయితే ఇది తెలుసుకోవాల్సిందే?

సాధారణ మనం ఎక్కడైనా బయటకు వెళ్ళినప్పుడు మన పాదరక్షణ కోసం సాక్సులు వేసుకోవడం జరుగుతుంది.సాధారణ చెప్పులు వేసుకున్నప్పటికీ కొందరు సాక్సులు వేసుకొని బయటకు వెళ్లడం అలవాటుగా ఉంటుంది అయితే ఇలా సాక్సులు వేసుకోవడం ఎంతో మంచిది అయితే చాలామంది చలికాలంలో ఇంట్లో కూడా సాక్సులు వేసుకొని తిరుగుతూ ఉంటారు. అంతేకాకుండా రాత్రి పడుకునే సమయంలో కూడా సాక్సులు వేసుకొని నిద్రపోతూ ఉంటారు అయితే ఇలా పడుకునే సమయంలో కూడా సాక్సులు వేసుకోవడం మంచిదేనా? ఇలా సాక్సులు వేసుకోవడం వల్ల ఏం జరుగుతుంది అనే విషయానికి వస్తే…

చలికాలంలో చాలామంది చలి తీవ్రతను తట్టుకోలేక నిద్రలో కూడా సాక్సులు వేసుకొని నిద్రపోతుంటారు. అయితే ఇలా నిద్రలో కూడా సాక్సులు వేసుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. మనం నిద్రపోయే సమయంలో సాక్సులు వేసుకోవడం వల్ల మన పాదాల్లో బ్లడ్ సర్క్యూలేషన్ మెరుగుపడుతుంది. ఇలా సాక్స్ వేసుకోవటం వలన కాళ్లలో రక్త ప్రసరణ సరిగ్గా లేకపోవడం వల్ల పాదాల వాపు, కాళ్ల తిమ్మిర్లు, కాళ్ల నొప్పి వంటి సమస్యలు తగ్గుతాయనీ నిపుణులు తెలియజేస్తున్నారు.

పాదాల ఆవిర్లు అనే సమస్య ముఖ్యంగా మెనోపాజ్ సమయంలో వస్తుంది. ఈ సమస్య కారణంగా నిద్ర సరిగా పట్టదు. ఇలాంటి సమయంలో కాటన్ సాక్సులు వేసుకోవడం వల్ల శరీర ఉష్ణోగ్రతలను క్రమబద్ధీకరించి ఎప్పుడు శరీరం వెచ్చగా ఉండేలా చేసి మంచి నిద్రను కలిగిస్తుంది. అయితే ఎప్పుడూ కూడా చాలా మృదువైన శుభ్రమైన కాటన్ సాక్షులు ధరించడం మంచిది అలా కాకుండా ఇతర సాక్షులను అపరిశుభ్రమైన సాక్షులను ధరించడం వల్ల కొన్నిసార్లు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంటుంది.