మనలో చాలామంది హెల్త్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా వైద్యులను సంప్రదిస్తూ వైద్యుల సలహాలు, సూచనలు పాటిస్తూ ఉంటారు. పాదాలకు సంబంధించి హెల్త్ కేర్ తీసుకోవడం వల్ల దీర్ఘకాలంలో వచ్చే సమస్యలను సులువుగా అధిగమించే అవకాశాలు ఉంటాయి. పాదాలను గోరువెచ్చని నీటిలో నానబెట్టడం ద్వారా అదిరిపోయే బెనిఫిట్స్ పొందవచ్చు.
గోరువెచ్చని నీటిలో పాదాలను నానబెట్టడం వల్ల శరీరం మొత్తం రిలాక్స్ అవుతుందని చెప్పవచ్చు. రోజంతా పని చేసి తీవ్ర అలసటకు గురైన వాళ్లు పాదాలను నానబెట్టడం ద్వారా ఆ సమస్యలను అధిగమించే ఛాన్స్ ఉంటుంది. శరీరాన్ని రిలాక్స్ చేయడంలో వేడినీళ్లు ఎంతగానో సహాయపడతాయని చెప్పవచ్చు. వేడి నీటిలో పాదాలను నానబెట్టడం ద్వారా మానసిక ఒత్తిడి సైతం దూరమవుతుంది.
కండరాల ఒత్తిడి, మోకాళ్ల నొప్పులతో బాధ పడేవాళ్లు పాదాలను వేడి నీటిలో నానబెట్టడం ద్వారా మంచి ఫలితాలను పొందవచ్చు. పాదాలను నానబెట్టడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గడంతో పాటు గోరువెచ్చని నీరు కండరాలకు విశ్రాంతిని ఇస్తుందని చెప్పవచ్చు. గోరువెచ్చని నీళ్ల వల్ల రక్తనాళాలు వాసోడైలేట్ అయ్యి, పాదాలకు ఎక్కువ రక్తం అందడంతో నొప్పి, వాపు తగ్గుతుంది.
పాదాలను బాగా స్క్రబ్ చేసి, గోరువెచ్చని నీటిలో నానబెట్టడం వల్ల డెడ్ స్కిన్ సులభంగా తొలగిపోయే అవకాశాలు ఉంటాయని చెప్పవచ్చు. పాదాలను నానబెట్టేటప్పుడు, చాలా వేడి నీటిని ఉపయోగించకూడదని గుర్తుంచుకోవాలి. నీళ్లు మరీ వేడిగా ఉంటే చర్మం పొడిబారుతుందని చెప్పవచ్చు. అరికాళ్ల మంటలతో బాధ పడేవాళ్లు సైతం ఈ చిట్కాలను పాటించాలి.