ప్రతి పనిలో విజయం సాధించాలా అయితే ఈ చెట్టుతో ఇలా చేయండి!

వేప చెట్టు ద్వారా రెండు రకాల ప్రయోజనాలు ఉన్నాయి. ఒకటి ఆరోగ్యానికి అవసరమైన ఔషధాలలో వాడటం అందరికీ తెలిసిందే. రెండవది దైవంగా భావిస్తాము, పూజిస్తాము ఇది కూడా చాలామందికి తెలుసు. బోనాల పండుగలో వేప ఆకు రెమ్మలను వాడతారు. ఎందుకంటే దుష్టశక్తులను తరిమేసామర్థ్యం ఈ చెట్టుకు కలదు.

వేప చెట్టు మన ఇంటి ఆవరణలో ఉన్నట్లయితే మన ఇంటి పై నరదిష్టి, ఇంకా ఏవైనా దుష్టశక్తులు ఏమైనా ఉంటే తొలగిపోతాయి. మనం ఎదుగుతుంటే చూసి సహించని వాళ్ళు ఎవరైనా మనపై గాని, మన ఇంటి పై గానీ చెడు ప్రయోగాలు చేస్తే అటువంటి వాటిని ఈ వేప చెట్టు సంగ్రహించుకొని మనకు ఏ విధమైన ఆపద లేకుండా చేస్తుంది. ఒకవేళ వేప చెట్టు ఎండిపోయి చనిపోయినట్లయితే మనపై చెడు ప్రభావం జరిగిందని అనుకోవచ్చు.

ఇక అసలు విషయానికి వస్తే సాయంత్రం స్నానం చేసి రెండు లవంగాలను కంకణం లాగా కట్టి, దేవుడి ముందర పెట్టి దేవుణ్ణి నమస్కరించుకొని ఆ లవంగాలను దిండు కింద పెట్టి పడుకోవాలి. మరుసటి రోజు ఉదయం శుభ్రంగా స్నానం చేసి దగ్గర్లో ఉన్న ఒక వేప చెట్టు దగ్గరికి వెళ్లి దాని మొదలు వద్ద కాస్త గొయ్యి తీసి అందులో ఈ లవంగాలను వేసి మనసులో మన బాధలు ఏమైనా ఉంటే కోరుకోవాలి.

ఆ తర్వాత దానిని పూడ్చివేసి వేప చెట్టును నమస్కరించుకుని ఇంటికి వచ్చేయాలి. ఇంతే ఇక చాలు దీని ద్వారా అప్పుల బాధలు తీరుతాయి. ఇంట్లో ఏవైనా తీరని సమస్యలు ఉంటే వాటికి పరిష్కారం మార్గం దొరుకుతుంది. ఏదైనా పని ప్రారంభిస్తే ఆటంకాలు ఏవి లేకుండా ఆ పని పూర్తవుతుంది. వేప చెట్టు ఆవరణలో చెడు ప్రయోగాలు, దుష్టశక్తులు వంటివి ఎక్కువ సమయం ఉండలేవు. ఒకసారి ప్రయత్నించి చూడండి.