వర్షాకాలంలో మొక్కజొన్న పొత్తులు ఎక్కువగా తింటున్నారా…ఇది మీ కోసమే?

కొన్ని రకాల కూరగాయలు పండ్లు ప్రత్యేకంగా కొన్ని సీజన్లలో మాత్రమే లభిస్తాయి. ఈ వర్షాకాలంలో మొక్కజొన్న పొత్తులు ఎక్కువగా లభిస్తాయి. ఈ వర్షాకాలంలో చల్లటి సాయంత్రం వేళ వేడి వేడి మొక్కజొన్న కంకులు తింటే ఆ అనుభూతే వేరుగా ఉంటుంది. మొక్కజొన్న కంకులు తినడానికి ఇష్టపడని వారంటూ ఉండరు. మొక్కజొన్న లో కూడా రెండు రకాలు ఉంటాయి. ముఖ్యంగా స్వీట్ కార్న్ ని చాలా ఇష్టంగా తింటారు. మొక్కజొన్నలు ఉడికించి లేదా కాల్చుకొని తినటం వల్ల చాలా రుచిగా ఉంటాయి. వీటితో చాలా రకాల వంటలు కూడా తయారు చేస్తారు. ఈ మొక్కజొన్నలు తినటానికి రుచిగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి కూడ చాల మంచిది. మొక్కజొన్నల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం.

మొక్కజొన్నలు అనేక రకాల పోషకాలు ఉంటాయి. అందుకే దీనిని పోషకాలు గని అని అంటారు. మొక్కజొన్నలో ఆంటీ ఆక్సిడెంట్ లో అధికంగా ఉండటం వల్ల ఏమీ శరీరంలో వ్యాది నిరోధక శక్తిని పెంపొందిస్తాయి. ముఖ్యంగా గర్భవతులు వీటిని తినటం వల్ల కడుపులో పెరుగుతున్న శిశువు ఆరోగ్యానికి ఎంతో మంచిది. మొక్కజొన్నలలో పోలిక్ యాసిడ్ ఉంటుంది. గర్భిణీలు వీటిని తినటం వల్ల కడుపులో పెరుగుతున్న శిశువు ఆరోగ్యంగా ఉంటుంది. అంతే కాకుండా మొక్కజొన్నలు ఐరన్ శాతం కూడా ఎక్కువగా ఉంటుంది. వీటిని తినడం ద్వారా రక్తంలో ఐరన్ శాతాన్ని పెంచి రక్తహీనత సమస్యను నివారిస్తుంది.

మొక్కజొన్నలలో క్యాల్షియం కూడా అధికంగా ఉంటుంది. వీటిని తినడం ద్వారా ఎముకలు కండరాలు దూడంగా ఉంటాయి. షుగర్ వ్యాధితో బాధపడే వారు కూడా వీటిని తినడం వల్ల ఎటువంటి ప్రమాదం ఉండదు. మొక్కజొన్నలు తినడం వల్ల రక్తంలో షుగర్ లెవెల్స్ అదుపులో ఉండేలా చేస్తాయి. ప్రస్తుత కాలంలో ఈ మొక్కజొన్నలను ఔషధాల తయారీలో కూడా ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అయితే అధిక బరువు ఉన్నవారు మొక్కజొన్నలను అధికంగా తినటం వల్ల ప్రమాదం ఉంటుంది. మొక్కజొన్నలలో క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల వీటిని ఎక్కువగా తింటే బరువు పెరిగే అవకాశం ఉంటుంది.