దేశంలో మధుమేహం వ్యాధిగ్రస్తుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. మధుమేహంతో బాధ పడేవాళ్లు టమోటాలు తినకూడదని వైద్యులు వెల్లడిస్తున్నారు. అనారోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం వల్ల ఎక్కువమంది మధుమేహం బారిన పడుతున్నారు. మధుమేహం రావడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. ఒక్కసారి మధుమేహం బారిన పడితే ఆ వ్యాధి నుంచి కోలుకోవడం సులువైన విషయం కాదు.
మధుమేహం ఉన్నవాళ్లు తీసుకునే ఆహారం విషయంలో కచ్చితంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. షుగర్ తో బాధ పడేవాళ్లు టమోటాలను ఎక్కువగా తీసుకోకూడదని వైద్యులు వెల్లడిస్తున్నారు. పరిమితంగా టమోటాలు తీసుకోవడం వల్ల ఎలాంటి సమస్య రాదని అయితే పరిమితికి మించి తీసుకుంటే మాత్రం ఇబ్బందులు తప్పవని తెలుస్తోంది.
మధుమేహం సమస్యతో బాధ పడేవాళ్లు తరచూ షుగర్ లెవెల్స్ ను చెక్ చేసుకుంటూ ఉండాలి. షుగర్ లెవెల్స్ భారీగా పెరిగితే మాత్రం మధుమేహంను కంట్రోల్ చేయడం కష్టం అవుతుందని చెప్పవచ్చు. మధుమేహం బారిన పడిన వాళ్లను ఇతర ఆరోగ్య సమస్యలు కూడా వేధించే అవకాశం ఉంటుంది. స్వీట్స్ తక్కువగా తీసుకోవడం వల్ల ఈ వ్యాధి బారిన పడే ఛాన్స్ ఉండదు.
షుగర్ తో చేసిన ఉత్పత్తులను సైతం పరిమితంగా తీసుకోవడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. చక్కెర వల్ల దీర్ఘకాలంలో ఆరోగ్యానికి హాని కలుగుతుంది. డయాబెటిస్ బారిన పడిన వాళ్లకు చిన్న ఆరోగ్య సమస్య తలెత్తినా కోలుకోవడం కష్టమవుతుంది.