మనలో చాలామంది ఖర్జూర గింజల గురించి ఏదో ఒక సందర్భంలో వినే ఉంటారు. ఖర్జూర గింజల వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. ఖర్జూర గింజలలో పోషకాలు ఎక్కువగా ఉండటం వల్ల, వాటిని తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు చేకూరుతుందని చెప్పవచ్చు. ఖర్జూర గింజలను ఉపయోగించి, స్మూతీలు, కాఫీ, టీ, బేకింగ్ వంటి వాటిని సులువుగానే తయారు చేసుకోవచ్చు.
ఖర్జూర గింజలలో పాలీఫెనాల్స్, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయనే సంగతి తెలిసిందే. ఖర్జూర గింజలను తినడం వల్ల ఆక్సీకరణ ఒత్తిడి, వాపు, మానసిక ఆరోగ్యం, పనితీరు మెరుగు పడే అవకాశాలు ఉంటాయి. ఖర్జూర గింజలు గుండె ఆరోగ్యానికి మేలు చేయడంతో పాటు కంటి సంబంధిత సమస్యలను దూరం చేస్తాయి.
ఖర్జూర గింజల నూనె జుట్టు రాలడాన్ని నివారించడంతో పాటు జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. ఖర్జూర గింజల పొడిని స్మూతీలు, కాఫీ, టీలో కలపి తీసుకునే అవకాశాలు ఉంటాయి. ఖర్జూర గింజలను వేయించి జంతువులకు ఆహారంగా కూడా ఇవ్వవచ్చు. ఖర్జూరం గింజల పొడి అసంతృప్త కొవ్వు ఆమ్లాలు, జింక్, కాడ్మియం, కాల్షియం , పొటాషియంతో కూడిన సమ్మేళనాలను కలిగి ఉంటాయని చెప్పవచ్చు.
అనేమియా సమస్యతో బాధ పడేవాళ్లు ఖర్జూర గింజలను తీసుకుంటే మంచిది. మెదడుకు శక్తిని అందించడంలో ఇది తోడ్పడుతుంది. ఖర్జూరంతో పోలిస్తే దాని విత్తనాలు ఎక్కువగా లాభాలను అందిస్తాయి. టిల్లో ఉన్న యాంటీవైరల్ ఏజెంట్లు, మూత్రపిండాలు, కాలేయం దెబ్బతినకుండా నిరోధించడానికి సహాయపడతాయని చెప్పవచ్చు.