మనలో చాలామందిని వేధించే ఆరోగ్య సమస్యలలో జలుబు, దగ్గు ముందువరసలో ఉంటాయనే సంగతి తెలిసిందే. ఒకసారి జలుబు, దగ్గు బారిన పడితే దీర్ఘకాలంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. తలనొప్పి, తలభారం, జ్వరం లాంటి సమస్యలకు సైతం జలుబు, దగ్గు పరోక్షంగా కారణమవుతాయని చెప్పవచ్చు. జలుబు, దగ్గు సమస్యలకు మందులు వాడినా ఆశించిన ఫలితం ఉండదు.
దగ్గు సమస్య వల్ల శరీరంలో శ్లేష్మం పెరిగే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. దగ్గుకు వాము ఆకులు దివ్యౌషధం అని చెప్పవచ్చు. నీటిలో కొద్దిగా వాము, బెల్లం వేసుకుని తీసుకుంటే హెల్త్ బెనిఫిట్స్ కలుగుతాయి. గోరువెచ్చగా ఉన్న సమయంలో ఈ నీటిని తీసుకుంటే మంచిది. దగ్గు, జలుబు ఉన్నప్పుడే కాకుండా మహిళలు నెలసరి సమయంలో కూడా ఈ జ్యూస్ ను తీసుకుంటే మంచిది.
చలికాలంలో ఈ డ్రింక్ ను ఎక్కువగా తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఆయుర్వేదంలో వాము, బెల్లం కలిపి ఉడికించిన నీళ్లు తాగడం వల్ల హెల్త్ బెనిఫిట్స్ కలుగుతాయి. జలుబు లేదా ఇతర కారణాల వల్ల విపరీతమైన వెన్నునొప్పి వేధించే ఛాన్స్ ఉంటుంది. వాము, బెల్లం కలిపి ఉడికించిన నీరు తాగడం వల్ల వెన్నునొప్పి తగ్గుతుందని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అక్కర్లేదు.
బెల్లం, వాము రెండూ కలిపి తయారుచేసిన డ్రింక్ తీసుకుంటే పైల్స్ సమస్య సైతం దూరమవుతుందని చెప్పవచ్చు. అయితే జ్యూస్ తాగినా ప్రయోజనం లేకపోతే మాత్రం వైద్యుల సలహాలు, సూచనల ప్రకారం మందులు వాడటం ద్వారా హెల్త్ బెనిఫిట్స్ పొందే అవకాశాలు ఉంటాయి.