కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ ఎన్నో పథకాలను అమలు చేస్తుండగా ఆయుష్మాన్ భారత్ స్కీమ్ పేరుతో కేంద్రం ఒక స్కీమ్ ను అమలు చేస్తోంది. కేంద్రం అమలు చేస్తున్న ఈ స్కీమ్ ద్వారా సులువుగా ఆరోగ్య సేవలు పొందే అవకాశం అయితే ఉంటుంది. ఈ స్కీమ్ కింద దరఖాస్తు చేసుకున్న వాళ్లకు కేంద్రం నుంచి గోల్డెన్ కార్డ్ పొందే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.
ఈ స్కీమ్ కు సంబంధించి కేంద్రం ఆయుష్మాన్ మిత్రను మొదలుపెట్టింది. కింద ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులలో ఆయుష్మాన్ మిత్రగా నియమితులు కావడం ద్వారా నెలకు కనీసం 15000 రూపాయల నుంచి 30000 రూపాయల వరకు వేతనం పొందే అవకాశాలు అయితే ఉంటాయి. ఆయుష్మాన్ మిత్రగా మారాలని భావించే వాళ్లు కొన్ని విషయాలను తప్పనిసరిగా తెలుసుకోవాలి.
ఆయుష్మాన్ పథకం కింద ప్రైవేట్, ప్రభుత్వ ఆసుపత్రుల్లో లక్ష మంది ఆయుష్మాన్ మిత్రలను నియమించాలని మోదీ సర్కార్ భావిస్తోంది. ఇంటర్ పాసైన యువత ఇందుకు అర్హులు కాగా లబ్ధిదారుల తయారీలో సమస్యలు రాకూడదనే ఉద్దేశంతో ఈ స్కీమ్ ను అమలు చేస్తున్నారు. ఈ స్కీమ్ ద్వారా భారీ సంఖ్యలో ఉద్యోగ అవకాశాలను అందించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.
రానున్న ఐదేళ్లలో 10 లక్షల మంది యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా అడుగులు పడుతున్నాయి. ఈ ఏడాది 20,000 మంది ఆయుష్మాన్ మిత్రలను నియమించనున్నారని తెలుస్తోంది. పరీక్షలో ఉత్తీర్ణులైన వారిని మాత్రమే ఆయుష్మాన్ మిత్ర పోస్టులో నియమించనున్నారు. రోగుల కోసం రూపొందిస్తున్న సాఫ్ట్ వేర్ పై ఈ ఉద్యోగులు పని చేయడం జరుగుతుంది.