పచ్చి ఏలకుల నీటిని తాగడం వల్ల కలిగే అద్భుతమైన లాభాలివే.. ఈ చిట్కాలు పాటించాల్సిందే/!

మనలో చాలామంది వంటకాలలో పచ్చి ఏలకులను ఉపయోగిస్తూ ఉంటారు. వంటగదిలో ఉండే వేడి మసాలాలను సరిగ్గా ఉపయోగించుకోవడం ద్వారా దీర్ఘకాలంలో ఎన్నో ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టే అవకాశం అయితే ఉంటుంది. కొన్ని వేడి మసాలాలు మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఔషధ గుణాలను కలిగి ఉండటం వల్ల చిన్నచిన్న ఆరోగ్య సమస్యలు సులువుగానే దూరమవుతాయని చెప్పవచ్చు.

యాలకులు ఆహారానికి రుచిని జోడించడానికి, స్వీట్లు, పాలు, టీలో కూడా ఉపయోగించడం జరుగుతుంది. ఎన్నో వ్యాధులకు చెక్ పెట్టడంలో యాలకులు సహాయపడతాయి. యాలకులు జీర్ణక్రియను మెరుగుపరచడంతో పాటు సీజనల్ వ్యాధుల నుండి రక్షిస్తుందని చెప్పవచ్చు. చలికాలంలో జీర్ణక్రియ మందగించడంతో పాటు జలుబు కూడా గందరగోళాన్ని క్రియేట్ చేస్తుంది.

ఏలకుల నీటి ఆరోగ్య ప్రయోజనాలను పొందడానికి, ఏలకులను రాత్రంతా నానబెట్టడం ఉత్తమమైన విధానం అని చెప్పవచ్చు. రెండు పచ్చి ఏలకులను తీసుకుని వాటిని దంచి, ఒక గ్లాసు నీళ్లలో రాత్రంతా నానబెట్టి ఉదయం సమయంలో ఖాళీ కడుపుతో తాగడం వల్ల బీపీ కంట్రోల్ లో ఉంటుంది. ఏలకుల నీటిని తీసుకోవడం వల్ల శరీరంలోని టాక్సిన్స్ బయటకు వెళ్లి జీర్ణక్రియ మెరుగుపడుతుంది.

చలి రోజుల్లో ఏలకుల నీటిని తీసుకోవడం ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పవచ్చు. యాలకుల నీళ్లు అధిక మోతాదు గుండెల్లో మంట, విరేచనాలు, వికారంతో సహా జీర్ణశయాంతర సమస్యలను కలిగిస్తుంది. యాంటీ డయాబెటిక్ మందులు తీసుకునే వ్యక్తులు క్రమం తప్పకుండా ఏలకుల నీటిని తీసుకునే ముందు వైద్యుడిని సంప్రదించాలి.