టమాటాలు ఎక్కువగా తినేవాళ్లకు షాకింగ్ న్యూస్.. అలాంటి ప్రమాదకర సమస్యలు వస్తాయా?

మనలో చాలామంది టమాటాలతో వండిన వంటకాలను ఎంతో ఇష్టంగా తింటారనే సంగతి తెలిసిందే. ప్రస్తుతం టమాటాల రేట్లు మండిపోతున్నాయి. కిలో టమాటాలను కొనుగోలు చేయాలంటే 100 రూపాయల నుంచి 150 రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంది. టమాటాలను కొనే, తినే పరిస్థితులు లేవని కామెంట్లు వినిపిస్తున్నాయి. టమాటాల ధరలు తగ్గాలంటే మరో నెలరోజులు ఎదురుచూపులు తప్పవని చెప్పవచ్చు.

టమాటాలతో చేసిన వంటకాలను తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. అయితే మరీ ఎక్కువగా టమాటాలతో చేసిన వంటకాలను తినడం ఆరోగ్యానికి మంచిది కాదు. టమాటాలతో చేసిన వంటకాలను ఎక్కువగా తింటే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. కిడ్నీలో రాళ్ల సమస్యకు టమాటా కొన్ని సందర్భాల్లో కారణమయ్యే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.

కిడ్నీలో రాళ్లతో బాధపడేవారు టమాటాలను తీసుకుంటే ఆరోగ్యానికి మరింత నష్టం కలుగుతుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. టమాటాలో అధిక మొత్తంలో ఉండే ఆక్సలేట్ వల్ల ఈ సమస్య వచ్చే అవకాశం అయితే ఉంటుంది. టమాటాలను తరచూ తినేవాళ్లలో కాల్షియం ఉత్పత్తి సైతం పెరుగుతుంది. కిడ్నీలు ఈ కాల్షియంను తొలగించడం కూడా సులువు కాదు.

అందువల్ల కిడ్నీలలో రాళ్ల రూపంలో కాల్షియం పేరుకుని పోయే అవకాశం అయితే ఉంటుంది. కిడ్నీల విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని చెప్పవచ్చు. కిడ్నీల విషయంలో ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా వెంటనే వైద్యులను సంప్రదించి తగిన జాగ్రత్తలు తీసుకుంటే మంచిది.