మనలో చాలామంది తాటి బెల్లం గురించి ఏదో ఒక సందర్భంలో వినే ఉంటారు. తాటిబెల్లం తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. తాటిబెల్లంలో పోషక విలువలు పుష్కలంగా ఉంటాయి. తాటిబెల్లంలో చక్కెరతో పోలిస్తే ఖనిజ లవణాలు ఎక్కువగా ఉంటాయి. తాటి బెల్లం తీసుకోవడం ద్వారా శరీరానికి అవసరమైన కాల్షియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం, పొటాషియం లభిస్తాయి.
అజీర్తి, మలబద్ధకం సమస్యలతో బాధ పడేవాళ్లకు తాటి బెల్లం వరం అని చెప్పవచ్చు. ఆ సమస్యలకు తాటి బెల్లం సులువుగా చెక్ పెడుతుంది. నెలసరి నొప్పులతో బాధ పడేవాళ్లు తాటి బెల్లం తీసుకోవడం ద్వారా ఆ సమస్యను సైతం దూరం చేసుకోవచ్చు. తిమ్మిరి, కడుపు నొప్పుల నుంచి ఉపశమనం కలిగించడంలో తాటి బెల్లం ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పవచ్చు.
పొడిదగ్గు, జలుబు సమస్యలకు సైతం తాటి బెల్లం చెక్ పెడుతుంది. గోరువెచ్చని కప్పు పాలల్లో చెంచా తాటిబెల్లం పొడి, పావుచెంచా మిరియాలపొడి వేసి తీసుకుంటే ఈ సమస్య దూరమవుతుంది. ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపరచడంలో తాటిబెల్లం సహాయపడుతుంది. తాటిబెల్లం తరచూ తీసుకోవడం ద్వారా ఎముకలు స్ట్రాంగ్ అయ్యే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.
శరీర వ్యవస్థను శుభ్రపరచడంలో తాటిబెల్లం సహాయపడుతుంది. ప్రేగులు, ఆహార పైపులు, ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలకు తాటి బెల్లం చెక్ పెడుతుంది. తాటి బెల్లం తీసుకోవడం వల్ల లాభాలే తప్ప నష్టాలు లేవు. తాటిబెల్లంను డైట్ లో భాగం చేసుకుంటే ఎంతో మంచిదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. తాటి బెల్లం తీసుకోవడం వల్ల లాభాలే తప్ప ఎలాంటి నష్టాలు లేవు.