మన దేశ ప్రజలు టీని ఎంతో ఇష్టంగా తాగుతారనే సంగతి తెలిసిందే. టీ తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు సైతం చేకూరుతాయి. ఇతర టీలతో పోల్చి చూస్తే బ్లాక్ టీని ఎక్కువమంది ఇష్టపడతారు. బ్లాక్ టీ బరువు తగ్గడంలో సహాయపడటంతో పాటు ఈ టీ తాగడం వల్ల శరీరంలో కొవ్వు ఐస్ లా కరిగిపోతుంది. బ్లాక్ టీలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు శరీరంలో ట్రైగ్లిజరైడ్ స్థాయిలను తగ్గించడం, శరీరంలో కొవ్వులను తగ్గించడం ద్వారా ఊబకాయాన్ని తగ్గిస్తాయి.
ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువ ఉంటే ఎక్కువ సంఖ్యలో ఆరోగ్య సమస్యలు వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. బ్లాక్ టీ తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని చెప్పవచ్చు. బ్లాక్ టీలో కేలరీలు చాలా తక్కువగా ఉండటంతో పాటు సంతృప్త కొవ్వులు అస్సలు ఉండవనే సంగతి తెలిసిందే. చక్కెర, తేనె వంటివి జోడించుకుంటే కేలరీలు పెరిగి బరువు తగ్గే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.
బరువు తగ్గాలని భావించే వాళ్లు బ్లాక్ టీ తాగితే మంచిది. బ్లాక్ టీ అనేది ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన టీ రకం అనే సంగతి తెలిసిందే. హార్ట్ స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గించడంతో పాటు రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో బ్లాక్ టీ సహాయపడుతుంది. బ్లాక్ టీ తాగడం వల్ల శరీరానికి లాభాలే తప్ప నష్టాలు లేవు. బ్లాక్ టీని ఎక్కువగా తాగేవాళ్లు ఈ విషయాలు గుర్తుంచుకోవాలి.