నల్ల బంగాళదుంపల వల్ల కలిగే అద్భుత లాభాలివే.. క్యాన్సర్, షుగర్ తో పాటు ఆ సమస్యలకు చెక్!

మనలో చాలామందికి సాధారణ బంగాళాదుంపల గురించి పూర్తిస్థాయిలో అవగాహన ఉంటుంది. సాధారణ బంగాళాదుంపల వల్ల ఎన్నో లాభాలు ఉన్నా కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. అయితే ఈ బంగాళదుంపల కంటే నల్ల బంగాళదుంపల వల్ల ఎక్కువగా లాభాలు ఉంటాయి. క్యాన్సర్, డయాబెటిక్ సమస్యలకు చెక్ పెట్టడంలో నల్ల బంగాళదుంపలు ఎంతగానో ఉపయోగపడతాయని చెప్పవచ్చు.

రైతులు ఈ నల్ల బంగాళదుంపలను సాగు చేయడం వల్ల కళ్లు చెదిరే స్థాయిలో లాభాలను పొందే అవకాశం అయితే ఉంది. నల్ల బంగాళదుంపలతో చేసిన వంటకాలు ఎంతో రుచికరంగా ఉంటాయి. బీహార్ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలలో ఈ బంగాళదుంపలను సాగు చేశారు. ఎన్నో ఔషధ గుణాలు ఉన్న ఈ బంగాళదుంపలు ఖరీదైనవి కావడంతో పాటు చాలా తక్కువ ప్రాంతాల్లో మాత్రమే ఇవి లభిస్తాయి.

నల్ల బంగాళదుంపలు కేజీ 1500 రూపాయలు కాగా ఇతర దేశాల నుంచి విత్తనాలు తెప్పించి బీహార్ లోని రైతులు ఈ పంటను పండించారు. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఈ పంటను రైతులు ఎక్కువగా పండించడం లేదు. సాగు పెరిగితే ఈ బంగాళదుంపల ఖరీదు తగ్గే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. ఈ నల్ల బంగాళదుంపలలో శరీరానికి అవసరమైన పోషక విలువలు ఉన్నాయి.

ఈ బంగాళదుంపల గ్లైసెమిక్ ఇండెక్స్ కేవలం 77గా ఉంది. పాలీఫెనాల్ యాంటీఆక్సిడెంట్లు ఈ నల్ల బంగాళదుంపలలో పుష్కలంగా ఉంటాయి. శరీరంలోని ప్రధాన అవయవాలకు ఈ నల్ల బంగాళదుంపల వల్ల మేలు జరుగుతుంది. ఈ నల్ల బంగాళదుంపలను డైట్ లో భాగం చేసుకుంటే మంచిది.