Health Tips: రాగి పాత్రలోని నీటిని తాగుతున్నారా… ఇవి తెలుసుకోవాల్సిందే?

Health Tips: ఒకప్పుడు నీరు తాగాలి అంటే కుండలో నీటిని తాగేవారు లేదంటే రాగి ఇత్తడి అవి లేకపోతే స్టీల్ పాత్రలలో నీటిని నిల్వ చేసుకొని తాగేవారు కానీ ఇప్పుడు మాత్రం అలా కాదు నీళ్లు మొత్తం ప్లాస్టిక్ క్యాన్లలో నిల్వ చేసి ఉంటారు. ఆ నీటిని ప్లాస్టిక్ బాటిల్ లో పట్టుకొని మరి తాగుతున్నారు. ఇక ఎక్కడికన్నా వెళ్లిన ప్లాస్టిక్ బాటిల్లో నిల్వచేసిన నీటిని కొనుగోలు చేసి తాగుతున్నాము. ఇలా ప్లాస్టిక్ బాటిల్ లో నిల్వ చేసిన నీరు తాగటం ఆరోగ్యానికి మంచిదనే విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే కొంతమంది తిరిగి పాతకాలపు పద్ధతిలోనే నీటిని నిల్వ చేసుకొని తాగుతున్నారు.

చాలామంది రాగి పాత్రలలో నీటిని నిల్వ చేసుకొని తాగటం మొదలుపెట్టారు. ఇలా తాగటం ఆరోగ్యానికి చాలా మంచిది అయినప్పటికీ పొరపాటున కూడా ఈ తప్పులు చేయకుండా కొన్ని జాగ్రత్తలను పాటిస్తూ తాగితే ఎలాంటి సమస్యలు ఉండవని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. రాగి పాత్రలో నీటిని తాగటం వలన ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనం కలుగుతుంది కానీ గ్యాస్, అల్సర్ వంటి సమస్యలు ఉన్నవారు రాగి పాత్రలోని నీటిని తాగకూడదు.

ఈ సమస్యలతో బాధపడేవారు రాగి పాత్రలోని నీటిని తాగడం వల్ల శరీరంలో వేడి ఉత్పత్తి అయ్యి ఈ సమస్యను మరింత తీవ్రతరం చేస్తుంది. అందువల్ల ఇలాంటి సమస్యలతో బాధపడేవారు ఆరోగ్య నిపుణులను సంప్రదించి రాగి పాత్రలోని నీటిని తాగటం ఎంతో మంచిది.కిడ్నీ లేదా గుండె సమస్యలు ఉన్నవారు కూడా రాగి పాత్రలలో తయారు చేసినటువంటి ఆహార పదార్థాలకు దూరంగా ఉండటం మంచిది. రాగి పాత్రలో పాలు లేదా పాల ఉత్పత్తులు, పుల్లని పదార్థాలు ఎప్పుడు తీసుకోకూడదు ఎందుకంటే రాగి పాత్రలో వీటిని ఉంచటం వలన అవి విషపూరితంగా మారే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.