మనలో చాలామంది ఆవు పెరుగును ఇష్టంగా తింటారు. ఆవు పెరుగు వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. గేదె పెరుగుతో పోల్చి చూస్తే ఆవు పెరుగు ఖరీదు ఎక్కువ అయినప్పటికీ ఆవు పెరుగుతో ఎన్నో లాభాలు ఉన్నాయని వైద్యులు వెల్లడిస్తున్నారు. ఆవు పెరుగు తీసుకోవడం వల్ల మినరల్స్, విటమిన్స్ తో పాటు ఫైబర్, ప్రోటీన్ కూడా లభించే ఛాన్స్ అయితే ఉంటుంది. బరువు తగ్గాలని భావించే వాళ్లు ఆవు పెరుగు తీసుకుంటే మంచిది.
ఆవు పెరుగు తీసుకోవడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. శరీరంలో ఇమ్యూనిటీ పవర్ పెంచడంలో ఆవు పెరుగు తోడ్పడుతుంది. జీర్ణ సంబంధిత సమస్యలతో బాధ పడేవాళ్లు ఆవు పెరుగు తీసుకుంటే ఆ సమస్యలు వచ్చే ఛాన్స్ ఉండదు. అయితే ఆవు పెరుగు వల్ల అలర్జీ ఉన్నవాళ్లు మాత్రం ఆవు పెరుగుకు వీలైనంత దూరంగా ఉంటే మంచిదని చెప్పవచ్చు.
ఆవు పెరుగును ప్రతిరోజూ తీసుకోవడం వల్ల కొత్త ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు అయితే ఉండవని చెప్పవచ్చు. ఆవు పాలు, ఆవు పెరుగు వల్ల ఎన్నో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఆవు పాలు, ఆవు పెరుగు లభ్యం కాని వాళ్లు మాత్రం గేదె పాలపై దృష్టి పెడితే మంచిదని చెప్పవచ్చు.
ప్రతిరోజూ పాలు తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. అయితే కొన్ని సందర్భాల్లో పాలు కల్తీ జరిగే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ప్యాకెట్ పాలను కొనుగోలు చేయడం కంటే ఆవు, గేదె పాలను కొనుగోలు చేసి తీసుకుంటే మంచిదని చెప్పవచ్చు.