కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ ఎన్నో స్కీమ్స్ ను అమలు చేస్తోంది. తక్కువ మొత్తంలో ఇన్వెస్ట్ చేయాలని అనుకునే వాళ్లకు మైక్రో ఫైనాన్స్ స్కీమ్స్ బెస్ట్ ఆప్షన్ అవుతాయని చెప్పవచ్చు. ప్రధాన్ మంత్రి సురక్ష బీమా యోజన, ప్రధాన్ మంత్రి జీవన్ జ్యోతి బీమా పేర్లతో కేంద్ర ప్రభుత్వం రెండు స్కీమ్స్ ను అమలు చేస్తోంది. ప్రధాన్ మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన స్కీమ్ ప్రజలకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.
ఈ స్కీమ్ తో పాటు ప్రధాన్ మంత్రి సురక్ష బీమా యోజన స్కీమ్ అమలవుతుండగా ఈ స్కీమ్ వల్ల కూడా ప్రజలకు ఎంతో బెనిఫిట్ కలుగుతుంది. 2015 సంవత్సరం నుంచి ప్రభుత్వం ఈ స్కీమ్స్ ను అమలు చేస్తుండగా ఈ స్కీమ్స్ వల్ల ఎంతో బెనిఫిట్ కలుగుతుందని చెప్పవచ్చు. తక్కువ ప్రీమియంను చెల్లించి ఈ స్కీమ్స్ ద్వారా ఎక్కువ బెనిఫిట్స్ ను పొందవచ్చు. సురక్ష బీమా యోజన ప్రీమియం 20 రూపాయలకు కేంద్రం పెంచింది.
జీవన్ జ్యోతి బీమా యోజన స్కీమ్ విషయానికి వస్తే ఈ స్కీమ్ ప్రీమియం 330 రూపాయల నుంచి 436 రూపాయలకు పెరగడం గమనార్హం. ఈ రెండు స్కీమ్స్ వల్ల వేర్వేరుగా 4 లక్షల రూపాయల బెనిఫిట్ పొందవచ్చు. కేవలం 456 రూపాయలు ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఊహించని మొత్తాన్ని బెనిఫిట్ గా పొందే అవకాశం అయితే ఉంటుంది. సురక్ష బీమా స్కీమ్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ స్కీమ్ గా అమలవుతోంది.
బ్యాంకుల ద్వారా ఈ స్కీమ్స్ ప్రజలకు మరింత దగ్గరయ్యేలా కేంద్రం కృషి చేస్తోంది. ఈ స్కీమ్స్ వల్ల ప్రజలకు ఊహించని స్థాయిలో బెనిఫిట్ అయితే కచ్చితంగా కలుగుతుందని చెప్పవచ్చు. ఈ స్కీమ్స్ గురించి సమీపంలోని బ్యాంకులను సంప్రదించి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.
