మహిళలకు మోదీ సర్కార్ సూపర్ స్కీమ్.. ఈ స్కీమ్ తో సులువుగా రూ.2 లక్షలు పొందే ఛాన్స్!

కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ ఎన్నో స్కీమ్స్ ను అమలు చేస్తుండగా మోదీ సర్కార్ స్కీమ్స్ లో కొన్ని స్కీమ్స్ అన్ని వర్గాల ప్రజలకు బెనిఫిట్ అందిస్తున్నాయి. కేంద్రం అమలు చేస్తున్న పథకాలలో స్వర్ణిమ పథకం ఒకటి కాగా కాల పరిమితితో కూడిన రుణాలను ఇప్పించేందుకు మోదీ సర్కార్ ఈ స్కీమ్ ను అమలు చేస్తోంది. ఈ స్కీమ్ పై వడ్డీ రేటు కేవలం 5 శాతం మాత్రమే కావడం గమనార్హం.

బీసీ మహిళలకు అన్ని విధాలుగా ప్రయోజనం చేకూర్చాలనే లక్ష్యంతో ఈ స్కీమ్ అమలు జరుగుతోంది. జాతీయ బీసీల ఫైనాన్స్ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ నోడల్ ఏజెన్సీల సహాయంతో ఈ స్కీమ్ ను అమలు చేస్తుండటం గమనార్హం. తక్కువ పెట్టుబడితో బిజినెస్ చేయాలని భావించే వాళ్లకు ఈ స్కీమ్ బెస్ట్ స్కీమ్ అవుతుంది. 2 లక్షల రూపాయల లోపు రుణం పొందాలని భావించే వాళ్లు ఈ స్కీమ్ పై దృష్టి పెడితే బాగుంటుంది.

18 నుంచి 55 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న స్త్రీలు ఈ స్కీమ్ పై దృష్టి పెట్టవచ్చు. 3 లక్షల రూపాయల కంటే వార్షికాదాయం తక్కువగా ఉన్న మహిళలు ఈ స్కీమ్ పై దృష్టి పెట్టవచ్చు. https://nsfdc.nic.in/channel-patrners/scas వెబ్ సైట్ ద్వారా ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, ఇతర ధృవీకరణ పత్రాల సహాయంతో ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

ఈ స్కీమ్ కోసం సులువుగా లోన్ పొందాలని భావించే వాళ్లు తక్కువ వడ్డీతోనే బెనిఫిట్ పొందే అవకాశం ఉండటంతో భారీగా బెనిఫిట్ కలుగుతుంది. స్వర్ణిమ స్కీమ్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుని రుణం తీసుకుంటే మంచిది. దీర్ఘకాలంలో బెనిఫిట్ పొందాలని భావించే మహిళలు ఈ స్కీమ్ పై దృష్టి పెట్టవచ్చు.