మహిళలకు మోదీ సర్కార్ అదిరిపోయే గుడ్ న్యూస్.. ఫ్రీగా 1,75,000 పొందే ఛాన్స్!

కేంద్ర ప్రభుత్వం సీనియర్ సిటిజన్ల తర్వాత ప్రధానంగా వృద్ధులపై దృష్టి పెడుతూ వృద్ధులకు మేలు చేసే విధంగా ఎన్నో పథకాలను అమలు చేస్తోంది. మహిళలకు కేంద్రం ఏకంగా 5 లక్షల రూపాయల సబ్సిడీ లోన్ ను ఇస్తుండటం ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది. ఎవరైతే ఈ రుణం పొందుతారో వాళ్లకు ఏకంగా 35 శాతం రాయితీ లభించనుండటం గమనార్హం.

ఈ రుణం తీసుకున్న వాళ్లు ఏకంగా 1,75,000 ఉచితంగా పొందే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. సొంతంగా స్వయం ఉపాధి యూనిట్లు ఏర్పాటు చేసుకోవాలని భావించి ఆర్థిక ఇబ్బందుల వల్ల వెనుకడుగు వేస్తున్న వాళ్లను దృష్టిలో ఉంచుకుని కేంద్రం ఈ స్కీమ్ ను అమలు చేస్తుండటం గమనార్హం. ప్రధానమంత్రి ఉద్యోగ కల్పన కార్యక్రమంను మోదీ సర్కార్ అమలు చేస్తోంది.

ఈ స్కీమ్ తో పాటు కేంద్రం ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ అనే స్కీమ్ ను సైతం అమలు చేస్తుండటం గమనార్హం. సబ్సిడీ పోగా మిగిలిన మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. తినే వంటకాలకు సంబంధించిన యూనిట్లను ఏర్పాటు చేయడం ద్వారా ఈ స్కీమ్ యొక్క బెనిఫిట్స్ ను పొందే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.

డీఆర్డీఓ అధికారులను సంప్రదించడం ద్వారా ఈ స్కీమ్ కు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశాలు అయితే ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు దీర్ఘకాలంలో మంచి లాభాలను అందిస్తాయి. కష్టపడే శక్తి ఉండి డబ్బు లేకపోవడం వల్ల ఇబ్బందులు పడుతున్న వాళ్లు ఈ స్కీమ్స్ పై దృష్టి పెట్టడం ద్వారా మంచి బెనిఫిట్స్ పొందవచ్చు.