నిరుద్యోగులకు అదిరిపోయే తీపికబురు.. భారీ వేతనంతో ప్రముఖ బ్యాంక్స్ లో జాబ్స్!

నిరుద్యోగులకు, ముఖ్యంగా బ్యాంక్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న వాళ్లకు మేలు జరిగేలా అదిరిపోయే తీపికబురు వచ్చింది. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర క్లర్క్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ను రిలీజ్ చేసి నిరుద్యోగులకు మేలు చేసింది. మహిళా క్రీడాకారుల కోసం ప్రత్యేకంగా బ్యాంకు రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ను నిర్వహిస్తుండగా వేర్వేరు టోర్నమెంట్లలో పాల్గొన్న మహిళా అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించి అర్హత కలిగి ఉంటారు.

టోర్నమెంట్స్ లో వాలీబాల్ ఆడిన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించి అర్హత కలిగి ఉంటారు. ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ లలో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఒకటి కాగా 12 బ్యాంక్ కస్టమర్ సర్వీస్ అసోసియేట్ (క్లర్క్) ఉద్యోగ ఖాళీలు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ కానున్నాయి. జులై 8వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉందని సమాచారం అందుతోంది.

18 నుంచి 25 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులు కాగా కనీసం పదో తరగతి పాసైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులు. గుర్తింపు పొందిన సంస్థ నుంచి అందుకు సమానమైన అర్హత కలిగి ఉన్నవాళ్లు సైతం ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. 50 మార్కులకు ప్రొఫీషియన్సీ టెస్టు, ఫీల్డ్ ట్రయల్ ఉంటుందని సమాచారం అందుతోంది.

ఫీల్డ్ ట్రయల్ కు సైతం 50 మార్కుల వెయిటేజీ ఉంటుందని తెలుస్తోంది. https://bankofmaharashtra.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవచ్చు. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర పూణే అడ్రస్ కు ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన దరఖాస్తులను పంపాల్సి ఉంటుంది.