స్నానం అనేది మన శరీరాన్ని శుభ్రంగా ఉంచే ప్రక్రియ మాత్రమే కాదు… ఆరోగ్యాన్ని కాపాడుకునే కీలక చర్య కూడా. కానీ చాలా మంది ఈ రోజూ స్నానాన్ని అలవాటు చర్యగా మార్చేసి, శరీరంలోని కొన్ని కీలక భాగాలపై శ్రద్ధ వహించరు.. దీంతో అనేక సమస్యలు ఎదురవుతాయి. ముఖ్యంగా అండర్ ఆర్మ్స్, మోచేతులు, మోకాళ్లు, తొడల చుట్టూ ప్రాంతాలు, పాదాలు, చెవుల చుట్టూ ప్రాంతాలను శుభ్రపరచడంలో అలసత్వం చూపడం వల్ల చర్మసంబంధిత ఇన్ఫెక్షన్లు, రంగు మార్పులు, దురద, అలర్జీలు మొదలైనవి రావడం మొదలవుతుంది.
ప్రతిరోజూ స్నానం చేస్తున్నా.. అండర్ ఆర్మ్స్‌ను శుభ్రం చేయడం మర్చిపోతే ఎంతో ప్రమాదం అంటున్నారు నిపుణులు. చెమట ఎక్కువగా వచ్చే ఈ భాగాన్ని నిత్యం శుభ్రం చేయకపోతే.. బాక్టీరియా పెరిగిపోతూ, దుర్వాసనతో పాటు ఇన్ఫెక్షన్లకు దారితీస్తుంది. ఇదే కాకుండా, మోచేతులు, మోకాళ్లను నిర్లక్ష్యం చేస్తే అవి క్రమంగా నలుపుగా మారతాయని చెబుతున్నారు. ఇది కేవలం చర్మాన్ని మాత్రమే కాదు, మన వ్యక్తిత్వాన్ని కూడా ప్రభావితం చేస్తుంది.
తొడల చుట్టూ ఉన్న ప్రాతాన్ని శుభ్రంగా ఉంచకపోతే చర్మం పొడిబారుతుంది. మురికితో పాటు, మేలిన చర్మపు పొరలు కూడా అక్కదే పేరుకుపోతాయి. ఇది మంట, దురద, ఇన్‌ఫెక్షన్‌లకు కారణమవుతుంది. స్నానం చేసేటప్పుడు ఈ ప్రాంతాన్ని కాస్త ప్రత్యేక శ్రద్ధతో శుభ్రం చేయడం ఎంతో ముఖ్యం. ఇక కాళ్ల వేళ్ల విషయానికి వస్తే, ఇవి మన శరీరంలోని అత్యంత మురికిగా మారే భాగాలు. పాదాలు భూమిని తాకే భాగం కాబట్టి ధూళి, మట్టితో బాగా నిండిపోతాయి. కానీ చాలా మంది వీటిని శుభ్రం చేయడంలో నిర్లక్ష్యం చేస్తుంటారు. ఇది ఫంగస్, దురద, పాద ఇన్ఫెక్షన్లకు దారితీస్తుంది.
చెవుల చుట్టూ ప్రాంతం.. ఇది కనిపించని భాగం కావచ్చు… కానీ మురికి పేరుకునే ప్రాంతాల్లో ఇదీ ముఖ్యమైనదే. ఈ ప్రాంతాన్ని శుభ్రంగా ఉంచకపోతే చర్మంపై నల్లని మచ్చలు, మేల్ పేరుకుపోయే ప్రమాదం ఉంది. ఈ విషయాలు చిన్నవిగా అనిపించవచ్చు. కానీ దీర్ఘకాలంగా ఇలా కొనసాగితే అవి పెద్ద సమస్యలుగా మారుతాయి. అందుకే ఏదో ఫార్మాల్టీ కోసం స్నానం చేయడం కాదు.. శరీరంపై శ్రద్ధ తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ప్రతీ భాగాన్ని శుభ్రంగా ఉంచే అలవాటు వేసుకుంటేనే ఆరోగ్యంగా ఆకర్షణీయంగా ఉంటారిన చెబుతున్నారు.