ఈ మధ్యకాలంలో చాలామంది బరువు పెరిగి పొట్ట ముందుకు కనపడుతుందని బాధపడుతుంటారు. రోజు అన్నం తక్కువ తింటున్నాము,డైట్ బాగానే ఫాలో అవుతున్న రోజంతా తీరిక లేకుండా పనిచేసిన కూడా బరువు విషయంలో ఏమీ చేయలేకపోతున్నాము అంటారు.
బరువు పెరగడానికి ముఖ్య కారణాలు ఏమనగా ఆయిల్ ను ఇంకా ఉప్పును ఎక్కువగా వాడడం. టైం కు ఆహారం తీసుకోకపోవడం. తగినంత శారీరక శ్రమ చేయకపోవడం. బయట ఆహారానికి ఎక్కువగా అలవాటు పడడం. లాంటి కారణాల వల్ల బరువు తొందరగా పెరుగుతారు.
బరువు తగ్గడానికి కడుపునిండా కాకుండా కాస్త ఖాళీ ఉండే విధంగా ఆహారం తీసుకోవాలి. అంటే ఒక రకంగా 20% కడుపు ఎల్లప్పుడూ ఖాళీగా ఉండాలి. ఆహారం తీసుకున్న వెంటనే కాకుండా కాస్త సమయం తర్వాత మంచి నీళ్లు తాగితే మంచిది. మనం తీసుకునే ఆహారానికి సరిపడా శ్రమ చేయాలి అంటే ఎక్సర్సైజ్ చేస్తేనే ఆహారంలోని కొవ్వు శరీరంలో పేరుకు పోకుండా బయటకు వెళ్తుంది.
మనం ఇంట్లో ఒకే చోట నిలబడి లేదా కూర్చొని పని చేసి మనం ఫ్రీగా లేము కదా ఏదో పని చేస్తూనే ఉన్నాం కదా అంటే మాత్రం బరువు తగ్గడం కష్టం. శరీరంలోని కండరాలు అవయవాలు కదిలే విధంగా నడవడం, పరిగెత్తడం, యోగాసనాలు వంటివి చేస్తే శరీరంలో కొవ్వు చెమట రూపంలో బయటకు వస్తుంది. చక్కగా ఆకుకూరలను అలవాటు చేసుకోవాలి.
ఉదయం లేవగానే మొదటగా కాస్త నడవడం, కాళీ కడుపుతో మంచినీళ్లు తాగడం మంచిది. మాంసాహారులను బయట తినకుండా ఇంట్లోనే వండుకోవడం, వారానికి ఒకటి లేదా రెండుసార్లు మాత్రమే తీసుకోవాలి. మనం రాత్రి పూట అన్నం తినకుండా చపాతీ తింటూ డైట్ ఫాలో అవుతాం అనుకుంటాం, ఇది నిజమే కానీ ఇందులో మనం విరివిగా ఆయిల్ ను వాడతాం. మనం డైట్ ను ఫాలో అవుతాం కానీ అందులో ఆయిల్, ఉప్పు శాతాన్ని గమనించము. కాబట్టి ఇలాంటి విషయాలు దృష్టిలో పెట్టుకుంటే బరువు తగ్గడం ఖాయం.