ప్రేమ అనేది ప్రతి ఒక్కరి జీవితంలోను ఎప్పుడో ఓసారి కలిగే అనుభూతి ఇలా ఒకసారి ప్రేమ చిగురించింది అంటే ఇతర వ్యక్తులతో ప్రేమలో పడటం ఇలా వారి ప్రేమను పెద్దల వరకు తీసుకెళ్లి పెద్దల సమక్షంలో ఒకటి కావడం జరుగుతుంది అయితే కొంతమంది మాత్రం ప్రేమ బంధం లోనే ఎన్నో గొడవలు పోట్లాటలు పడుతూ వారి ప్రేమ బంధాన్ని అక్కడితోనే ఆపి వేస్తుంటారు.. అయితే మీరు ప్రేమలో కనుక ఉన్నట్లయితే ఈ సంకేతాలు గనుక మీకు అనిపిస్తే తప్పనిసరిగా మీరు మీ ప్రేమబంధంలో సంతోషంగా ఉన్నారని అర్థం లేదంటే మీ బంధం ఎప్పటికైనా తెగిపోతుంది అని చెప్పాలి.మరి ప్రేమలో సంతోషంగా ఉన్నారని తెలిపే ఆ సంకేతాలు ఏంటి అనే విషయానికి వస్తే…
*సాధారణంగా మనుషులు అన్న తర్వాత ప్రతి ఒక్కరు ఏదో ఒక విషయంలో తెలిసి తెలియకో తప్పు చేస్తూ ఉంటారు ఇలా తప్పు చేసినప్పుడు మీరు ప్రేమలో ఉన్న వ్యక్తి ఆ తప్పులను విమర్శించకుండా అందులో ఉండే లోపాలను మీకు తెలియచేస్తే మీరు ప్రేమ బంధం లో సంతోషంగా ఉన్నట్టే.
*భాగస్వామికి నచ్చని పని చేస్తున్నా దానికి మద్దతు పలకడం. మీకిష్టమైన పని అవతలి వారు చేయకపోయినా, మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా మీకు మద్దతు తెలుపుతూ ఉంటారు.
*మీరిద్దరూ ప్రేమలో ఉండి జీవితాన్ని కడుపుతున్నప్పటికీ ఎవరికీ నచ్చిన జీవితం వారు జీవించాలని స్వేచ్ఛ ఉంటుంది అయితే మీరు మీకు నచ్చినట్టు కనక జీవిస్తూ ఉంటే మీ బంధం ఎంతో సంతోషంగా ఉందని అర్థం.
*మీరు మీ ప్రేమలో ఉన్న వ్యక్తితో ఎప్పుడూ అసౌకర్యంగా ఫీల్ అవ్వకుండా మీకు ఏదైనా చెప్పాలి అనిపిస్తే నిర్మొహమాటంగా చెబుతూ ఉన్నప్పుడు మీ మధ్య ఎంతో మంచి సంతోషకరమైన వాతావరణం ఉందని అర్థం.