‎Viswak Sen: ప్రేమలో పడ్డాను.. బ్రేకప్ అయ్యింది.. ఎమోషనల్ అయ్యాను: విశ్వక్ సేన్

Viswak Sen: టాలీవుడ్ యంగ్ హీరోలలో ఒకరైన విశ్వక్ సేన్ గురించి మనందరికీ తెలిసిందే. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్నారు విశ్వక్ సేన్. ప్రేక్షకులకు నచ్చే విధంగా విభిన్నమైన కంటెంట్ తో సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. అందులో భాగంగానే విశ్వక్ సేన్ ప్రస్తుతం ఫంకీ అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. అనుదీప్ కేవి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా నుంచి టీజర్ ని విడుదల చేశారు మేకర్స్.

‎ఈ మూవీ టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఈ టీజర్ కు ప్రేక్షకుల నుంచి పాజిటివ్గా స్పందన లభించింది. ఈ టీజర్ చూసిన ప్రేక్షకులు విశ్వక్ సేన్‌ ఈ మూవీతో హిట్ పడటం పక్కా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే గతంలో విశ్వక్ సేన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో మరోసారి వైరల్ గా మారాయి. కాగా విశ్వక్ సేన్ గతంలో మాట్లాడుతూ తన లవ్, బ్రేకప్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు.  విశ్వక్ మాట్లాడుతూ.. టీనేజ్ లో ఉన్నప్పుడు ఎవరైనా అమ్మాయిని చూస్తే ఇష్టం కలుగుతుంది. దాన్ని మనం సీరియస్ రిలేషన్ షిప్ అనుకుంటాము.  నాకు కూడా ఓకే స్టోరీ ఉంది.

నేను 24 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ప్రేమలో పడ్డాను. ఆ తర్వాత మూడున్నర ఏళ్లకే నా లవ్ బ్రేక్ అయ్యింది. 24 ఏళ్ల వయసులో ప్రేమలో పడటం తర్వాత బ్రేకప్ జరగడంతో చాలా బాధపడ్డాను. ఆ తర్వాత దాని నుంచి బయట పడ్డాను. కెరీర్ మీద ఫోకస్ చేశాను. ఆ తర్వాత నాకు ఎవరి మీద ఇష్టం కలగలేదు. సరైన సమయం వచ్చినప్పుడు పెళ్లి చేసుకుంటాను. జీవితంలో కొన్ని కొన్ని తలచుకుంటే కన్నీళ్లు వస్తాయి. 27 ఏళ్ళ వయసులోనూ కన్నీళ్లు పెట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. కన్నీళ్లు పెట్టుకుంటేనే మనం దాని నుంచి త్వరగా బయటకు రాగలం అని అన్నారు విశ్వక్ సేన్. ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.