వర్షాకాలంలో గోరువెచ్చని నీటిని తాగుతున్నారా…ఇవి తెలుసుకోవాల్సిందే!

వర్షాకాలం అనగానే జలుబు దగ్గు జ్వరం తలనొప్పి వంటి సీజనల్ వ్యాధులతో పాటు డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వంటి అనేక ప్రాణాంతకమైన వ్యాధులు కూడా తొందరగా వ్యాప్తి చెందుతాయి. వర్షాకాలంలో దోమలు ఉండటం వల్ల ఈ వ్యాధులు వ్యాప్తి చెంది కొన్ని సందర్భాలలో ప్రాణాంతకంగా కూడా మారుతాయి. అయితే ఈ వర్షాకాలంలో ప్రతిరోజు ఉదయం గోరువెచ్చని నీటిని తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని వైద్యులు సూచిస్తున్నారు. వర్షా కాలంలో గోరువెచ్చని నీటిని తాగడం వల్ల కలిగే ఉపయోగాలు ఏమిటో తెలుసుకుందాం.

సాధారణంగా వర్షాకాలంలో బ్యాక్టీరియా, వైరస్ ఇన్ఫెక్షన్ కారణంగా ఈ వ్యాధులు వ్యాపిస్తాయి. అయితే ఈ వర్షాకాలంలో వచ్చే వ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే ప్రతిరోజు గోరువెచ్చని నీటిని తాగటం అలవాటు చేసుకోవాలి. వర్షాకాలంలో ప్రతిరోజు ఉదయం ఒకటి లేదా రెండు గ్లాసుల గోరువెచ్చని నీటిని తాగటం వల్ల ఇవి శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని బలోపేతం చేయడమే కాకుండా శరీరంలో మెటబాలిజం కూడా పెరిగి అనేక సమస్యలను దరిచేరకుండా ఉపయోగపడతాయి. ముఖ్యంగా వర్షాకాలంలో వ్యాయమాలు చేయడం కుదరని వారు ఇలా ప్రతిరోజు పరుగడుపున గోరువెచ్చని తాగటం వల్ల శరీరంలో పేరుకుపోయిన కరిగించి మలినాలు బయటకి వస్తాయి. దీంతో శరీరం దృఢంగా తయారవుతుంది.

అంతేకాకుండా ఈ గోరు వెచ్చని నీటిని తాగడం వల్ల జీర్ణ క్రియ మెరుగుపడి జీర్ణ సంబంధిత వ్యాధుల నుండి విముక్తిని పొందవచ్చు. ఈ గోరువెచ్చని నీటిలో కొంచెం జీలకర్ర పొడి వేసుకొని తాగడం వల్ల అజీర్తి వంటి జీర్ణక్రియ సంబంధిత వ్యాధులు దూరం అవుతాయి. ఇక ఈ గోరువెచ్చని నీటిలో కొంచెం తేనె నిమ్మరసం కలిపి తాగడం వల్ల శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరిగి వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధులు దరిచేరకుండా ఉంటాయి. అంతేకాకుండా ఒక గ్లాసు నీటిలో అల్లం వేసి బాగా మరిగించి ఆ నీటిని గోరువెచ్చగా చల్లార్చిన తర్వాత తాగాలి. ప్రతిరోజు ఉదయం ఇలా చేయటం వల్ల కూడా వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. వర్షాకాలంలో ఇలా ఉదయమే కాకుండా రోజంతా కూడ గోరు వెచ్చని నీటిని తాగటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.