ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగుల సంఖ్య లక్షల్లో ఉందనే సంగతి తెలిసిందే. ఏపీ నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరేలా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటూ ఉండటం గమనార్హం. 49 టాప్ ఐటీ, ఐటీ ఆధారిత కంపెనీలలో 10000కు పైగా ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ఈ జాబ్ ఫెయిర్ ను నిర్వహించనున్నారు. నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్ వేర్ అండ్ సర్వీస్ కంపెనీస్ ఈ జాబ్ మేళాను నిర్వహిస్తుంది.
ఈ నెల 5, 6 తేదీలలో గీతం యూనివర్సిటీ వేదికగా కెరీర్ ఫెయిర్ ఉండనుంది. గతేడాది, ఈ ఏడాది డిగ్రీ పాసైన అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హత కలిగి ఉంటారు. టెక్, ఆర్ట్స్, సైన్స్, పాలిటెక్నిక్ అండ్ డిప్లొమా విద్యార్థులు ఈ జాబ్ ఫెయిర్ కు అర్హత కలిగి ఉంటారు. మొదట హాజరైన వాళ్లకు తొలి ప్రాధాన్యత ఇచ్చే విధంగా ఈ జాబ్ ఫెయిర్ ఉంటుందని సమాచారం అందుతోంది.
ఈ జాబ్ ఫెయిర్ విషయంలో ఆసక్తి ఉన్న అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకుంటే మంచిది. మార్చి 3వ తేదీ ఆన్ లైన్ రిజిస్ట్రేషన్లకు చివరి తేదీగా ఉంది. ఎక్కువ సంఖ్యలో కంపెనీలు పాల్గొననున్న నేపథ్యంలో నిరుద్యోగులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రయోజనం చేకూరుతుందని చెప్పడంలో సందేహం అవసరం లేదు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లకు భారీ వేతనం లభించనుంది.
వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు బెనిఫిట్ కలుగుతుంది. జాబ్ ఫెయిర్ కు సంబంధించి సందేహాలు ఉంటే https://docs.google.com/forms/d/e/1faipqlsd2mclz5buuw2fqclmbwjag4jifdu8auw-wqbqn2hgd0sq5ww/viewform?pli=1 లింక్ ద్వారా తెలుసుకునే అవకాశాలు అయితే ఉంటాయి.