ప్రస్తుత కాలంలో లైంగిక సమస్యలు సర్వ సాధారణం అయిపోయాయి. వయస్సు ఎక్కువగా ఉన్నవాళ్లలో చాలామందిని ఈ తరహా సమస్యలు వేధిస్తున్నాయి. దాంపత్య జీవితం సంతోషంగా ఉండాలని భావించే వాళ్లు లైంగిక సమస్యలు ఉంటే విటమిన్ బి-12, విటమిన్ డి, విటమిన్ ఇ లోపం ఉందేమో చెక్ చేసుకోవాలి.
ఇవి రక్త ప్రసరణకు ఎలాంటి ఆటంకాలు లేకుండా చేయడంతో పాటు టెస్టోస్టెరాన్ లెవెల్స్ ను సైతం పెంచుతాయని చెప్పవచ్చు. మాంసం, చేపలు, గుడ్లు, పాల ఉత్పత్తుల్లో విటమిన్ బి12 పుష్కలంగా లభించే అవకాశాలు అయితే ఉంటాయి. నాడీ వ్యవస్థ పని తీరును మెరుగుపరిచే విషయంలో కూడా విటమిన్ బీ12 తోడ్పడుతుంది. విటమిన్ డి టెస్టోస్టెరాన్ స్థాయిలను పెంచడంలో తోడ్పడుతుంది.
శరీరంలో క్యాల్షియం, భాస్వరం శోషణకు ఇది తోడ్పడుతుందని చెప్పవచ్చు. గుడ్లు, చేపలు, పాలు, పుట్టగొడుగులు తినడం ద్వారా మంచి ఫలితాలను పొందే అవకాశాలు ఉంటాయి. విటమిన్ ఇ పురుషాంగం శక్తిని పెంచి పనితీరును మెరుగుపరుస్తుందని చెప్పవచ్చు. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ నుంచి శరీరాన్ని కాపాడే అవకాశాలు అయితే ఉంటాయి.
పొద్దుతిరుగుడు విత్తనాలు, పాలకూర, అవకాడో తినడం ద్వారా ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయని చెప్పవచ్చు. ఈ మూడు విటమిన్ల లోపాలు ఉన్నవాళ్లు వైద్యులను సంప్రదించి సరైన సమయంలో చికిత్స చేయించుకోవడం ద్వారా మెరుగైన ఫలితాలను పొందే అవకాశాలు అయితే ఉంటాయి.