ఈ మధ్య కాలంలో జిడ్డు చర్మం సమస్యతో బాధ పడే వాళ్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. జిడ్డు చర్మానికి చెక్ పెట్టడానికి ఇంటి చిట్కాలు, ఫేస్ ప్యాక్‌లు, మాయిశ్చరైజర్‌లు వంటివి ఉపయోగపడతాయని చెప్పవచ్చు. పండిన అరటిపండును తేనెతో మెత్తగా చేసి ముఖానికి అప్లై చేసి 20 నిమిషాల తర్వాత కడిగేయడం ద్వారా జిడ్డు చర్మానికి శాశ్వతంగా చెక్ పెట్టే అవకాశాలు అయితే ఉంటాయి.
ఆరెంజ్‌లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది, ఇది చర్మాన్ని ప్రకాశవంతం చేస్తుందని చెప్పవచ్చు. టమాటాలో ఉండే విటమిన్ సి, సిట్రికామ్లం జిడ్డు సమస్యకు బాగా పనిచేస్తుందని చెప్పడంలో సందేహం అవసరం లేదు. ముఖం జిడ్డుగా ఉంటే నిత్య జీవితంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పవచ్చు. ముఖం జిడ్డుగా మారుతుంటే చిన్నచిన్న చిట్కాలు పాటించడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయి.
జిడ్డు చర్మానికి మెరుపును ఇవ్వడంలో ముల్తానీ మట్టి ఎంతగానో సహాయపడుతుంది. యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉన్న ముల్తానీ మట్టి ఎన్నో ఆరోగ్య లాభాలను అందిస్తుందని చెప్పవచ్చు. చర్మానికి మెరుపును ఇచ్చే విషయంలో ముల్తానీ మట్టికి ఏదీ సాటిరాదు. వేప పేస్ట్, ముల్తానీ మట్టి కలిపి పేస్ట్ లా చేసుకుంటే ఆరోగ్యానికి మేలు జరుగుతుంది.
ముల్తాని మట్టిని ముఖానికి రాసిన తర్వాత పావుగంట పాటు అలాగే ఉంచి ముఖం శుభ్రం చేయడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయి. చందనం, ముల్తానీ మట్టి కలిపి ముఖంపై రాసుకుంటే ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. తులసి ఆకులతో నీటిని ఉడికించి ఆ నీటిని ముఖంపై స్ప్రే చేస్తే కూడా మంచి ఫలితాలు ఉంటాయి.
