లో బీపీ సమస్యతో మీరు బాధ పడుతున్నారా.. సమస్యకు చెక్ పెట్టే చిట్కాలివే!

ప్రస్తుత కాలంలో వయస్సుతో సంబంధం లేకుండా చాలామందిని లో బీపీ సమస్య వేధిస్తోంది. తక్కువ రక్తపోటుతో బాధ పడేవాళ్లకు కొన్నిసార్లు ప్రాణాలకే ప్రమాదం కలిగే అవకాశాలు అయితే ఉంటాయి. లో బీపీ సమస్యతో బాధ పడేవాళ్లలో చాలామందిని తల తిరగడం, మూర్ఛ, బలహీనత, కంటిచూపు మసకబారడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లాంటి సమస్యలు వేధించే ఛాన్స్ ఉంటుంది.

లో బీపీ సమస్యతో బాధ పడేవాళ్లు కొన్ని పదార్థాలను తమతో ఉంచుకుంటే మంచిది. తక్కువ రక్తపోటుతో బాధపడేవారు ఎప్పుడూ తమతో బాదం ఉంచుకుంటే బీపీ అదుపులో ఉంటుంది. బలహీనంగా అనిపించినప్పుడు, రక్తపోటు తగ్గిందని అనిపించినప్పుడు కొన్ని బాదం పప్పులు తినడం ద్వారా ఈ సమస్యను సులువుగా అధిగమించే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.

రక్తపోటును ప్రభావవంతంగా కంట్రోల్ చేసే వాటిలో తులసి ఆకులు ఒకటి కాగా ఇందులో ఉండే మెగ్నీషియం, పొటాషియం రక్తపోటును అదుపులో ఉంచడంలో లో బీపీ సమస్యకు చెక్ పెట్టే విషయంలో ఎంతో ఉపయోగపడతాయని చెప్పవచ్చు. రక్తపోటును నియంత్రించడంలో కూడా డార్క్ చాక్లెట్ ప్రభావవంతంగా పని చేస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు.

లో బీపీ సమస్యతో బాధ పడేవాళ్లు ఈ విషయాలను తప్పనిసరిగా గుర్తుంచుకుంటే మంచిది. తగినంత నీరు తాగుతూ ఉండటం ద్వారా లో బీపీ సమస్యకు చెక్ పెట్టవచ్చు. సమతుల ఆహారం తీసుకోవడం ద్వారా రక్తపోటును బ్యాలెన్స్డ్ గా ఉంచుకోవచ్చు. తక్కువ పరిమాణంలో ఎక్కువ సార్లు ఆహారం తీసుకోవడం పట్ల దృష్టి పెట్టి సమతుల ఆహారం తీసుకుంటే మంచిది. లో బీపీ వల్ల తరచూ తలనొప్పి వచ్చే ఛాన్స్ ఉంటుంది.