మనలో చాలామంది ఆహారం విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. తీసుకునే ఆహారం మలం రూపంలో బయటకు వెళ్లిపోతేనే శరీరం బాగుంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మలం ప్రేగులలోనే చిక్కుకొని పోతే కడుపు భారంగా ఉండటం, ఉబ్బరంగా అనిపించడం, శరీరంలో గ్యాస్ పేరుకుపోవడం జరిగే అవకాశాలు అయితే ఉంటాయి.
ఆహారం సరిగా జీర్ణం కాకపోవడం, జీర్ణ సంబంధ సమస్యలు మలబద్ధకం సమస్యకు కారణమయ్యే అవకాశం ఉంటుంది. ఆహారంలో ఫైబర్, ద్రవ పదార్థాలు ఉంటే మైదా, బిస్కెట్లు, రోటీలు, పిండి పదార్థాలు, జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్, బర్గర్లు, పిజ్జా తీసుకుంటే మలబద్దకం వచ్చే సమస్య ఎక్కువగా ఉంటుంది. జీర్ణ సమస్యలను పరిష్కరించడంలో జీలకర్ర, వాము ఉపయోగపడుతుందని చెప్పవచ్చు.
జీల కర్ర, వామును మజ్జిగలో కలిపి తీసుకుంటే మలబద్దకం సమస్య నుండి ఉపశమనం పొందే అవకాశం ఉంటుంది. మలబద్దకం సమస్య పరిష్కారం కావాలంటే జీలకర్ర, వామును మజ్జిగలో కలిపి తాగితే మంచిది. కడుపులో ఆరోగ్యకరమైన బ్యాక్టీరియాను సమతుల్యంగా ఉంచుతుందని చెప్పవచ్చు. పేగులను ఆరోగ్యంగా మార్చడంలో ఉపయోగపడుతుంది.
గ్యాస్, ఎసిడిటీ సమస్యలు తొలగించడంలో ఇది ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. వాములో ఉండే థైమోల్ అనే సమ్మేళనం మలబద్దకాన్ని తొలచించుకునే అవకాశం ఉంటుంది. మలబద్ధకం సమస్య విషయంలో రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది.