మనలో చాలామంది మరమరాలతో చేసిన వంటకాలను తినడానికి ఎంతగానో ఇష్టపడతారు. పఫ్డ్ రైస్ తినడం వల్ల ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ కలుగుతాయని చెప్పవచ్చు. మరమరాలు ఇమ్యూనిటీ పవర్ ను పెంచడంలో ఎంతగానో సహాయపడతాయి. అధిక రక్తపోటు, హార్ట్ స్ట్రోక్ వంటి వాటిని నిరోధించడంలో తోడ్పడతాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులకు మేలు చేయడంలో మరమరాలు ఎంతో సహాయం చేస్తాయి.
బలమైన ఎముకలు, దంతాలు ఉండేట్లు దోహదం చేయడంలో మరమరాలకు ఏవీ సాటిరావని చెప్పవచ్చు. శరీర బరువు తగ్గించుకోవాలనుకునే వారికి మరమరాల వల్ల ఊహించని స్థాయిలో ప్రయోజనం చేకూరుతుంది. మరమరాలు కండరాల ఆరోగ్యంలో కీలక పాత్ర పోషిస్తాయని చెప్పవచ్చు. మరమరాలతో చేసిన వంటకాలను తీసుకుంటే మలబద్ధకం సమస్య దూరమయ్యే అవకాశాలు ఉంటాయి.
శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించడానికి మరమరాలు సహాయపడతాయి. మరమరాలు జీర్ణక్రియ ప్రక్రియను సులభతరం చేస్తాయని చెప్పడంలో సందేహం అవసరం లేదు. మరమరాలను స్నాక్‌గా, బ్రేక్ ఫాస్ట్‌గా తీసుకుంటారని చెప్పవచ్చు. మరమరాల మిక్చర్, ఉగ్గాణి, పులిహోర వంటివి తయారు చేసుకుని తినడం ద్వారా ఈ హెల్త్ బెనిఫిట్స్ ను పొందవచ్చు.
మరమరాలలో విటమిన్ డి, బిలతో పాటు కాల్షియం, ఐరన్, థయామిన్, రిబోఫ్లావిన్ సమృద్ధిగా ఉంటాయని చెప్పవచ్చు. ఈ పోషకాలు ఎముకలు, దంతాలను దృఢంగా మార్చడంతో పాటు ఆస్టియోపొరోసిస్ ముప్పును తగ్గించడంలో ఎంతగానో సహాయపడతాయి. వీటిని వేర్వేరు ప్రాంతాల్లో బొరుగులు, ముర్ముర్లు, మురీలు అని కూడా పిలుస్తారు. మరమరాలతో చేసిన వంటకాలను తీసుకోవడం వల్ల బరువు కూడా కంట్రోల్ లో ఉంటుందని చెప్పవచ్చు.