ఆ సమస్యలు ఉన్నవాళ్లు వేరుశనగ తింటే ఇంత నష్టమా.. అసలేం జరిగిందంటే?

మనలో చాలామంది వేరుశనగను ఎంతో ఇష్టంగా తింటారు. ప్రోటీన్, విటమిన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, పోషకాలు వేరుశనగలో పుష్కలంగా ఉంటాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతిరోజూ గుప్పెడు వేరుశనగ తీసుకుంటే శరీరానికి అవసరమైన ప్రోటీన్లు లభిస్తాయి. అయితే వేరుశనగ వల్ల ఎన్నో లాభాలు, ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ కొంతమంది మాత్రం వేరుశనగ అస్సలు తినకూడదు.

వేరుశనగ తింటే అలెర్జీ ఉన్నవాళ్లు వేరుశనగ తీసుకోవడం ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదు. చర్మం పై దద్దుర్లు, దురద, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి సమస్యలతో ఇబ్బంది పడేవాళ్లు సైతం వేరుశనగ తీసుకోకూడదు. ఆస్తమా రోగులు వేరుశనగను ఎక్కువగా తినకూడదని వైద్యులు చెబుతున్నారు. వేరుశనగలో ఉండే సమ్మేళనాలు ఆస్తమా లక్షణాలను ప్రేరేపించి, సమస్యను మరింత పెంచే ఛాన్స్ అయితే ఉంటుంది.

యూరిక్ యాసిడ్ సమస్యతో ఇబ్బంది పడేవారు దాన్ని పెంచే ఆహారాలను అస్సలు తినకూడదని వైద్యులు వెల్లడిస్తున్నారు. వేరుశనగలో ప్యూరిన్లు యూరిక్ యాసిడ్ ప్రమాదాన్ని పెంచే అవకాశాలు అయితే ఉంటాయి. వేరుశనగలో కేలరీలు ఎక్కువగా ఉండటం వల్ల బరువు ఎక్కువగా ఉన్నవాళ్లు వేరుశనగను పరిమితంగా తీసుకుంటే ఆరోగ్యానికి మేలు చేకూరుతుందని చెప్పవచ్చు.

కిడ్నీలో రాళ్ల సమస్యతో ఇబ్బంది పడేవారు, ఇప్పటికే కుటుంబంలో కిడ్నీ రాళ్ల సమస్యతో బాధపడేవారు ఉంటే వాళ్లు పరిమితంగా వేరుశనగను తీసుకోవాలి. వేరుశనగలో ఉండే ఆక్సలేట్లు కిడ్నీలో రాళ్ల ప్రమాదాన్ని పెంచుతాయి. వేరుశనగ ఎక్కువగా తీసుకునే వాళ్లు ఈ విషయాలను తప్పనిసరిగా గుర్తుంచుకుంటే మంచిది.