బచ్చలికూరను ఎక్కువగా తినేవాళ్లకు షాకింగ్ న్యూస్.. ఇన్ని ప్రమాదకరమైన సమస్యలు వస్తాయా?

ఆకుకూరలు తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయనే సంగతి తెలిసిందే. అయితే ఆకుకూరలు పరిమితంగా తీసుకుంటే ఎలాంటి నష్టం లేకపోయినా అపరిమితంగా తీసుకుంటే మాత్రం ఆరోగ్యానికి హాని కలుగుతుంది. ఆకుకూరలను క్రమం తప్పకుండా తీసుకుంటే క్యాన్సర్ వచ్చే ప్రమాదం అయితే ఉందని వైద్య నిపుణులు చెబుతుండటం గమనార్హం. సలాడ్స్ లో పచ్చి బచ్చలి కూర తినడం ఆరోగ్యానికి మంచిది కాదు.

ఆక్సాలిక్ యాసిడ్స్ ను ఎక్కువగా కలిగి ఉన్న పచ్చి బచ్చలి కూర వల్ల ఆరోగ్యానికి హాని కలిగే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి. బచ్చలి కూర రసం తాగడం వల్ల కిడ్నీ సంబంధిత సమస్యలతో పాటు జీర్ణ సంబంధిత సమస్యలు సైతం వచ్చే ఛాన్స్ ఉంటుందట. పరిమితికి మించి బచ్చలికూరను తీసుకుంటే గ్యాస్, కడుపు ఉబ్బరం, నొప్పి లాంటి ఆరోగ్య సమస్యలు వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందని తెలుస్తోంది.

బచ్చలికూర పరిమితంగా తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. బచ్చలికూర తీసుకోవడం ద్వారా శరీరానికి అవసరమైన విటమిన్లు లభించే అవకాశాలు అయితే ఉంటాయి. రక్తహీనతతో బాధపడే వాళ్లకు ఇది దివ్యౌషధం అని చెప్పవచ్చు. బచ్చలికూరలో ఉండే కాల్షియం వల్ల ఎముకలు బలపడే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.

బచ్చలికూరలో ఉండే ఒమేగా3 ఫ్యాటీ యాసిడ్స్, నియాసీన్, సెలీనియం వల్ల మెదడు, నరాలకు సంబంధించిన సమస్యలు సులువుగా దూరమవుతాయి. కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు, పైల్స్ సమస్యలతో బాధ పడే వాళ్లు మాత్రం బచ్చలి కూరను తీసుకోవడం ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదని చెప్పవచ్చు.