పరగడుపున శనగలు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలివే.. ఆ సమస్యలకు చెక్!

వైద్యులలో చాలామంది పరగడుపున శనగలు తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయని చెబుతున్నారు. శనగలు తినడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో లాభాలు చేకూరుతాయి. బరువు తగ్గాలని భావించే వాళ్లు పరగడుపున శనగలు తింటే ఎంతో మంచిదని చెప్పవచ్చు. శనగలలో ప్రోటీన్, ఫైబర్ ఎక్కువగా ఉండగా జీర్ణ సంబంధిత సమస్యలను శనగలు దూరం చేస్తాయని చెప్పవచ్చు.

పిల్లల నుంచి పెద్దల వరకు హెల్తీ స్నాక్ గా శనగలను తీసుకోవచ్చు. శరీరంలోని ఆల్ఫా లినోలెనిక్ యాసిడ్, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్, కొలెస్ట్రాల్ లెవెల్స్‌ ను తగ్గించడంలో శనగలు తోడ్పడతాయి. గుండె సంబంధిత సమస్యలతో పాటు ఇతర సమస్యలను శనగలు దూరం చేస్తాయి. ఎమినో యాసిడ్స్, ట్రైప్టోఫాన్, సెరోటొనిన్ పుష్కలంగా ఉండే శనగలు తీసుకోవడం వల్ల నిద్ర సంబంధిత సమస్యలు దూరమవుతాయి.

శనగలు తీసుకోవడం ద్వారా శరీరానికి అవసరమైన కాల్షియం కూడా సులభంగా లభించే అవకాశం అయితే ఉంటుంది. ప్రొటీన్ లోపంతో బాధపడేవాళ్లు, శాఖాహారులు శనగలను రోజూ తీసుకుంటే మంచిదని చెప్పవచ్చు. పీచు పదార్థాలు ఎక్కువగా ఉండే శనగలు తీసుకోవడం వల్ల ఆరోగ్య సమస్యలు కూడా దూరమవుతాయి. శరీరానికి అవసరమైన విటమిన్స్ కూడా శనగల ద్వారా లభిస్తాయి.

శనగలలో కొవ్వు శాతం తక్కువగా ఉంటుందని చెప్పవచ్చు. శనగలు తినడం ద్వారా మాంసాహారం తింటే ఏ స్థాయిలో ప్రయోజనాలు లభిస్తాయో అదే స్థాయిలో ప్రయోజనాలను పొందే అవకాశాలు ఉన్నాయి. శనగలు తినడం వల్ల లాభాలే తప్ప నష్టాలు లేవని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. శనగలను ప్రతిరోజూ ఆహారంలో భాగం చేసుకుంటే ఎంతో మంచిదని చెప్పవచ్చు.