అంజీర పండ్లతో అద్భుతమైన లాభాలు.. ఈ బెనిఫిట్స్ తెలిస్తే మాత్రం షాకవ్వాల్సిందే!

మనలో చాలామంది అంజీర పండ్లను ఎంతో ఇష్టంగా తింటారు. డ్రైఫ్రూట్స్ లో అంజీర ఎంతో ప్రత్యేకం అని చెప్పవచ్చు. ప్రతిరోజూ ఉదయం సమయంలో అంజీరా తీసుకోవడం ద్వారా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ పొందవచ్చు. కాజు, బాదం, పిస్తా, వాల్ నట్స్, కిస్మిస్ లను మించిన ఆరోగ్య ప్రయోజనాలను అంజీర ద్వారా పొందే ఛాన్స్ ఉంటుంది. ఆయుర్వేదంలోనూ అంజీరకు ఎంతో ప్రాముఖ్యం ఉంటుంది.

అంజీరను నానబెట్టిన నీళ్లను తాగినా ఎన్నో రకాల రోగాలు మటుమాయం అవుతాయని వైద్యులు చెబుతున్నారు. అంజీరను రాత్రంతా నానబెట్టి ఆ నీటిని తీసుకోవడం వల్ల ముందుగా గుండెకు ఎంతో మేలు జరుగుతుందని చెప్పవచ్చు. బ్లడ్ ప్రెజర్ స్థాయిలను కంట్రోల్ చేయడంతో పాటు గుండె పనితనాన్ని మెరుగుపరిచే విషయంలో అంజీరా తోడ్పడుతుంది. ఒమెగా 3, 6 ఫ్యాటీ ఆసిడ్స్ గుండె జబ్బులను నయం చయడంలో కీలక పాత్ర పోషిస్తాయి.

అంజీరను రాత్రంతా నానబెట్టడం వల్ల ఆ నీరు కాల్షియంను ఎక్కువగా గ్రహించే ఛాన్స్ ఉంటుంది. జాయింట్లను పటిష్టం చేసి ఎక్కువకాలం యాక్టివ్ గా ఉండేలా చేయడంలో అంజీరా సహాయపడుతుంది. డయాబెటిస్ పేషంట్లు స్వీట్లు, తీయగా ఉండే పండ్లు తినడం ఆరోగ్యానికి మంచిది కాదు. అయితే అంజీరను మాత్రం ఎలాంటి సందేహాలు లేకుండా తీసుకోవచ్చు.

ఇన్సులిన్ ఉత్పత్తిని సైతం బ్యాలెన్స్ చేయడంలో ఇది ఉపయోగపడుతుంది. అంజీరను రోజూ తినడం వల్ల మలబద్దకం సమస్య వచ్చే అవకాశాలు ఉండవు. పేగుల కదలికలను సులభతరం చేసి మోషన్ ఫ్రీగా అయ్యేలా చసే లాక్సేటివ్ ప్రాపర్టీస్ అంజీర నీటిలో ఉంటాయి. అంజీర తినడం వల్ల పేగుల్లో ఇన్ ఫ్లమేషన్ తగ్గుతుంది.

రక్తహీనత కారణంగా ఏర్పడే జట్టు రాలడం, నీరసం, చర్మం పాలిపోయినట్టుగా ఉండటం, బరువు తగ్గిపోవడం లాంటి సమస్యలకు ఇది దివ్యౌషధం అని చెప్పవచ్చు. ఆరోగ్యంగా ఉన్నవారెవరైనా రోజుకు రెండు నుంచి మూడు అంజీరలను తీసుకోవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు.