ప్రస్తుత కాలంలో ఎన్నో ఫైనాన్స్ కంపెనీలు పుట్టుకొస్తున్నాయి. వీటి ద్వారా లోన్ తీసుకున్నవారు సకాలంలో ఆ లోన్ చెల్లించాలి. ఇదిలా ఉండగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల కీలక నిర్ణయం తీసుకుంది. నిబంధనలను అతిక్రమించిన కొన్ని ఫైనాన్స్ కంపెనీల లైసెన్స్ ని రద్దు చేసింది. ఆర్బిఐ లైసెన్సీ రద్దు చేసిన ఫైనాన్స్ కంపెనీలలో రినో ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ కూడా ఒకటి. ఇలా నిబంధనలకు అతిక్రమంగా నిర్వహిస్తున్న 16 ఫైనాన్స్ కంపెనీల లైసెన్సులను ఆర్బీఐ రద్దు చేసినట్లు ప్రకటించింది. లోన్ మంజూరులో అక్రమ పద్ధతులను పాటించడం వల్ల ఈ ఫైనాన్స్ కంపెనీల లైసెన్సులు ఆర్బిఐ రద్దు చేసినట్లు తెలుస్తోంది.
ఔట్ సోర్సింగ్, ఫెయిర్ ప్రాక్టీస్ కోడ్ వంటి వాటిని రినో ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అతిక్రమించినట్లు ఆర్బిఐ వెల్లడించింది. అంతే కాకుండా ఆన్‌లైన్‌లో రుణ మంజూరు ప్రక్రియలో కూడా నిబంధలను అతిక్రమించిందని ఆర్‌బీఐ పేర్కొంది. ఈ ఫైనాన్స్ పలు థర్డ్ పార్టీ యాప్స్‌తో కలిసి కస్టమర్లకు రుణాలు అందిస్తోంది. రూల్స్ అతిక్రమణ నేపథ్యంలో ప్రజా ప్రయోజనాల కోసం రినో ఫైనాన్స్ లైసెన్స్‌ను క్యాన్సిల్ చేసినట్లు ఆర్‌బీఐ తెలిపింది. అంతేకాకుండా ఈ ఫైనాన్స్ కంపెనీ కస్టమర్ల దగ్గరి నుంచి భారీగా వడ్డీని వసూలు చేస్తోందని, ఇంకా లోన్ రికవరీలో వేధింపులకు పాల్పడుతోందని ఆర్‌బీఐ తెలిపింది.
లైసెన్స్ రద్దు నేపథ్యంలో ఇకపై ఈ ఫైనాన్స్ కంపెనీ ఎలాంటి కార్యకలాపాలు . అందువల్ల నిర్వహించడానికి వీలులేదు అందువల్ల ఫైనాన్స్ కంపెనీ బాధితులు ఈ కంపెనీకి సంబంధించి ఎటువంటి లావాదేవీలు జరుపకూడదు. రోజురోజుకి లోన్ యాప్స్ వేధింపుల బాధితులు పెరుగుతున్న తరుణంలో ఆర్‌బీఐ కఠిన నిర్ణయం తీసుకుందని చెప్పుకోవచ్చు. కాగా రినో ఫైనాన్స్ కంపెనీ అనేది హెలో లోన్, క్రెడిట్ హబ్, కూకూ క్యాష్, ఫ్లాష్ లోన్, బ్రిడ్జ్ లోన్, క్రేజీ బీ, క్రెడిట్ వాలెట్, క్యాష్‌టీఎం, యూయూ క్యాష్, రూపీ ప్లస్, క్రెడిట్ రూపీ, క్యాష్ డాడీ, గెట్ రుపీ, క్యాషిన్, క్రెడిట్ క్లబ్, రుపీ బస్ వంటి థర్డ్ పార్టీ యాప్స్ ద్వాకా కస్టమర్లకు రుణాలు అందిస్తోంది. అందువల్ల యాప్స్ ఉపయోగించే వారు అంటే ఈ యాప్స్ ద్వారా లోన్ తీసుకున్న వారు ఈ విషయం గురించి తెలుసుకోవాలి. అందువల్ల ఆన్లైన్లో లోన్ పొందాలనుకునేవారు ఆర్బిఐ ద్వారా లైసెన్స్ పొందిన యాప్ లో మాత్రమే లోన్ తీసుకోవాలి.