మనలో చాలామంది అనం తిన్న తర్వాత చేసే చిన్నచిన్న తప్పులు ఆరోగ్యపరమైన ఇబ్బందులను కలిగిస్తాయి. అన్నం తిన్న వెంటనే కొన్ని చెడు అలవాట్లు చేయకుండా ఉండడం వల్ల ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ చేకూరుతాయి. అన్నం తిన్న వెంటనే టీ తాగడం మానుకుంటే మంచిది. అన్నం తిన్న వెంటనే స్వీట్స్ తినడం మానుకోవడం మేలు చేస్తుంది. అన్నం తిన్న తర్వాత అదనపు గాలిని బయటకు నెట్టడానికి త్రేన్పులు వస్తాయి.
ఎక్కువగా గాలిని మింగడం వల్ల ఎక్కువగా త్రేన్పులు ఎక్కువగా వస్తాయి. అన్నంలో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండటంతో పాటు అన్నం తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మామూలుగా ఆహారం తిన్న తర్వాత కెఫిన్ ఉత్పత్తులను ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. అయితే వీటికి వీలైనంత దూరంగా ఉంటే ఆరోగ్యానికి మేలు కలుగుతుంది.
తిన్న వెంటనే అధిక మొత్తంలో నీరు త్రాగడం వల్ల కడుపులోని ఆమ్లం పలుచన అయ్యే అవకాశాలు ఉంటాయి. తిన్న వెంటనే ఎటువంటి తీవ్రమైన శారీరక శ్రమ చేయకూడదని గుర్తుంచుకోవాలి. ఒకవేళ చేస్తే కడుపులో అసౌకర్యం, తిమ్మిరి, బద్ధకం కలుగుతాయి. తిన్న తర్వాత దంతాలను శుభ్రం చేయకపోతే, అది దంతాలు, చిగుళ్ళకు హాని కలిగించే అవకాశాలు ఉంటాయి.
తిన్న వెంటనే పడుకోవడం గుండెల్లో మంట, యాసిడ్ రిఫ్లక్స్‌కు కారణం అవుతుంది. ఆహారం తీసుకున్న కనీసం రెండు నుండి మూడు గంటల తర్వాత మాత్రమే నిద్రపోయేలా ప్రణాళికలను సిద్ధం చేసుకుంటే ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయని కచ్చితంగా చెప్పవచ్చు.