కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ లక్షపతి దీదీ యోజన పథకం పేరుతో ఒక స్కీమ్ ను అమలు చేస్తోంది. ఈ స్కీమ్ ద్వారా కేంద్ర ప్రభుత్వం మహిళలకు వడ్డీ లేని రుణాలను అందిస్తోంది. స్వయం సహాయక బృందంలో సభ్యులుగా ఉన్న మహిళలు ఈ స్కీమ్ ద్వారా బెనిఫిట్స్ పొందవచ్చు. మహిళలకు ఆర్థిక స్వాతంత్య్రం కల్పించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ స్కీమ్ ను అమలు చేస్తోంది.
ఈ స్కీమ్ ద్వారా 2 కోట్ల మంది మహిళలకు ప్రయోజనం చేకూరాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. రాబోయే రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరిగేలా మోదీ సర్కార్ అడుగులు పడుతున్నాయి. గ్రామీణ ప్రాంతాలలో నివశించే మహిళలు ఈ స్కీమ్ ద్వారా ఎక్కువగా బెనిఫిట్స్ పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. గ్రామీణ మంత్రిత్వ శాఖ ఈ పథకాన్ని అమలు చేస్తోంది.
ఈ పథకానికి సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే https://lakhpatididi.gov.in/ వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చు. ఏదైనా నైపుణ్యం ఉండి వ్యాపారం చేసే ఆసక్తి ఉన్న మహిళలు ఈ రుణం పొందడానికి అర్హత కలిగి ఉంటారు. ఈ స్కీమ్ ద్వారా తీసుకున్న రుణానికి వడ్డీ ఉండదు కాబట్టి ఎక్కువమంది ఈ లోన్ పై ఆసక్తి చూపిస్తారు. ఈ లోన్ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పవచ్చు.
లక్ష రూపాయల నుంచి లోన్ పొందే అవకాశం ఉండటంతో మహిళలకు సైతం ఈ స్కీమ్ వల్ల ఎంతో బెనిఫిట్ కలుగుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. సమీపంలోని బ్యాంక్ బ్రాంచ్ లేదా అధికారులను సంప్రదించడం ద్వారా స్కీమ్ గురించి పూర్తి వివరాలను తెలుసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది.