కేంద్రంలో అధి కరంలో ఉన్న మోదీ సర్కార్ ఎన్నో స్కీమ్స్ ను అమలు చేస్తుండగా ఈ స్కీమ్స్ వల్ల దీర్ఘకాలంలో భారీ స్థాయిలో బెనిఫిట్స్ పొందే అవకాశం అయితే ఉంటుంది. ఎన్‌పీఎస్ వాత్సల్య పేరుతో కేంద్రం తాజాగా ఒక కొత్త స్కీమ్ ను ప్రకటించిన సంగతి తెలిసిందే. పేరెంట్స్ తమ పిల్లల కోసం ఇన్వెస్ట్ చేయాలని భావిస్తే ఈ స్కీమ్ బెస్ట్ స్కీమ్ అవుతుందని కచ్చితంగా చెప్పవచ్చు.
ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా దీర్ఘకాలంలో మంచి రాబడులను పొందవచ్చు. ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసిన డబ్బులకు కాంపౌండింగ్ బెనిఫిట్స్ సైతం లభిస్తాయని చెప్పవచ్చు. రిటైర్మెంట్ సమయంలో ఈ స్కీమ్ ద్వారా ఏకంగా 60 శాతం తీసుకోవడంతో పాటు ప్రతి నెలా పెన్షన్ రూపంలో డబ్బులు పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.
17 సంవత్సరాల లోపు పిల్లల పేర్లపై వాత్సల్య అకౌంట్ ను ఓపెన్ చేసే అవకాశం అయితే ఉంటుంది. నెలకు ఇన్వెస్ట్ చేసే మొత్తాన్ని బట్టి పొందే మొత్తంలో మార్పులు ఉంటాయి. రోజుకు 166 చొప్పున నెలకు 5000 పొదుపు చేస్తే 40 లక్షలు పొందే ఛాన్స్ ఉంటుంది. ఈ స్కీమ్ లో ఏడాదికి 10000 చొప్పున 60 ఏళ్ల పాటు ఇన్వెస్ట్ చేస్తే 10 కోట్ల రూపాయలకు పైగా పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.
ఎన్‌పీఎస్ వాత్సల్య స్కీమ్ వల్ల దీర్ఘకాలంలో భారీ స్థాయిలో బెనిఫిట్ పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. కేంద్ర ప్రభుత్వం దీర్ఘకాలంలో ఇన్వెస్ట్ చేయాలని భావించే వాళ్లకు మేలు చేసేలా ఈ స్కీమ్ ఉందని చెప్పవచ్చు.