శృంగారం సైడ్ ఏఫెక్ట్స్ లేని దివ్య ఔషధం

 

శృంగారం అనేస‌రికి చాలా మంది ఏతో త‌ప్పు భావ‌న‌తో చూస్తారు. కానీ అది కూడా మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌న్న విష‌యాన్ని చాలా మంది గ్ర‌హించ‌రు. మనిషికి జీవించటానికి గాలి, నీరు తిండి ఎంత అవసరమో అలానే శృంగారం కూడా అంతే అవసరం. శృంగారం లేని జీవితం ‘షుగర్ లేని టీ’ లాంటిది. అటువంటి టీ తాగినా ఒక్కటే తాగక పోయినా ఒక్కటే. పండ్లు ఫలాలు, ఆహార ధాన్యాలు ఇవ్వని అపూర్వమైన ఆరోగ్యాన్ని శృంగారకేళి ఇస్తుంది. ఇక శృంగారం వలన లాభాలు చెప్పు కోవా లంటే అదో పెద్ద మహా భారతం అవుతుంది. అందుకే అంత విపులంగా కాకుండా సంక్షిప్తంగా కొన్ని ముఖ్య లాభాలను తెలుసుకుందాం.

శృంగారంలో పాల్గొనటం వలన మ‌న‌కు ల‌భించే ఎన్నో లాభాల గురించి ఈశీర్షిక‌తో తెలుసుకుందాం. మ‌న‌కు రోజంతా ఎన్ని ఒత్తిడిలు ఉన్నా శృంగారంలో పాల్గొన‌డం వ‌ల్ల వాటి నుండి విముక్తి పొందవచ్చు. అదే విధంగా మ‌న శ‌రీరంలోని చాలా క్యాలరీలను కరిగిస్తుంది. దాని వ‌ల్ల రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది. మ‌న‌లోని రెసిస్టెన్స్ ప‌వ‌ర్ పెరుగుతుంది. ఆత్మ విశ్వాసాన్నికూడా పెంపొందించుకోవ‌చ్చ‌ని కొంత మంది శాస్త్ర‌వేత్త‌లు చెబుతున్నారు. మ‌న గుండె బ‌ల‌హీన‌త‌ను కూడా త‌గ్గించి ఆరోగ్యాన్ని పెంచుతుంది. కేన్సర్ రిస్క్ నుండి తగ్గిస్తుంది. ఒక‌రి నుండి మ‌రొక‌రి మ‌ధ్య ఆత్మీయతను పెంచుతుంది. కండరాల శక్తిని పెంచుతుంది. బాగా అలిసిపోయిన త‌ర్వాత శృంగారంలో పాల్గొంటే చక్కని నిద్ర నిస్తుంది. అన్ని విధాలుగా ఆరోగ్యం మెరుగుపడుతుంది. వారంలో రెండు సార్లు సంభోగంలో పాల్గొనటం వలన ఙ‌క శ‌రీరానికి ఎలాంటి వ్యాయామాలు అవసరం లేదు. వారంలో రెండు సార్లు సంభోగంలో పాల్గొనటం వలన గుండెపోటు (హార్ట్ ఎటాక్‌) వ‌చ్చే అవ‌కాశాలు కూడా చాలా త‌క్కువ‌గా ఉంటాయి. వారానికి కనీసం ఒక్కసారైనా శృంగారంలో పాల్గొనాలి “టెలిమోర్స్” నిడివి పెరిగి, స్త్రీలు మరింత అందంగా, ఎక్కువ కాలం యవ్వనంగా కనిపిస్తారట.

శృంగారంలో పాల్గొన్న సమయంలో విడుదలయ్యే హార్మోన్లు చక్కటి ఫీల్‌ను ఇస్తాయి. శృంగారం వల్ల మహిళల్లో కటి కండరాలు బలోపేతం అవుతాయి. రెగ్యులర్‌గా సెక్స్ చేసేవారు తక్కువ వయసున్న వారిలా కనిపిస్తారు. వివిధ భంగిమల్లో శృంగారం చేస్తే వివిధ ఆసనాలు చేసే పని తప్పుతుంది. రతి క్రీడలో పాల్గొన్న తర్వాత తలనొప్పి ఎగిరిపోతుంది. మహిళ ఛాతీ కండరాలకు, ఇతర శరీర భాగాలకు వ్యాయామం లభిస్తుంది. స్త్రీ పైన ఉండి లైంగిక క్రీడ సాగిస్తున్నప్పుడు భారాన్ని ఎక్కువగా పురుషుడు మోస్తాడు. దానివల్ల పురుషుడికి ఎక్కువ వ్యాయామం లభిస్తుంది.