శృంగారం ఎప్పుడూ అన్ని వేళలో ఒకలా ఉండదు. అది మన మనస్సు ఉల్లాసంగా ఉన్నప్పుడు మాత్రమే ఆనందంగా ఎంజాయ్ చేయగలము. కొన్ని సందర్భాల్లో చాలా ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడూ ఎంజాయ్ చేసేవారు ఉన్నట్టుండి తమ ప్రమేయం ఏమీ లేదన్నట్టుగా వ్యవహరిస్తుంటారు. ఈ పరిస్థితి ఎప్పుడో ఒకప్పుడు అందరికీ ఎదురయ్యే ఉంటుంది. శరీరం తన పని తాను చేసుకొంటూ వెళుతుంటే మనసు మాత్రం మరో లోకంలో విహరిస్తూ ఉంటుంది. తమకెదురైన ఇలాంటి పరిస్థితి గురించి కొందరు మహిళలు తమ మనసులో దాచుకున్న విషయాలను బయటపెట్టారు.
శృంగారాన్ని ఎంజాయ్ చేయాలంటే అది భాగస్వామి పైనే ఆధారపడి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో సెక్స్ బోర్ కొడుతుంది. అలాంటి సమయంలో కొంతమంది ఇతర విషయాల గురించి ఆలోచిస్తుంటుంటారు. ప్రతి దానికి లిస్ట్ మెయింటైన్ చేస్తుంటారు. ఆ సమయంలో నేను ఆ లిస్ట్ లో చెక్ చేయాల్సిన విషయాల గురించి ఆలోచిస్తుంటాను. సమయాన్ని ఉపయోగించుకోవడంలో తప్పు లేదు కదా. శృంగారాన్ని ఆస్వాదించడమనేది పూర్తిగా ఆ సమయాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో చాలా బాగుందనిపించిన సెక్స్ కొన్నిసార్లు నచ్చదు. అలాంటి సందర్భాలు చాలా మందికి ఎదురయ్యాయి. అలాంటి పరిస్థితుల్లో కొన్నిసార్లు తర్వాతి రోజు ఏం చేయాలో ఆలోచించేదాన్ని. ఇలాంటి ఓ సంఘటన బాగా గుర్తుండిపోయింది.
లైంగిక చర్య జరుపుతున్న సమయంలో మనసులో ఎన్నో ఆలోచనలు వస్తాయి. నేనిప్పుడు ఎలా కనిపిస్తాననే ఆలోచనే ఎక్కువ సార్లు వస్తుంది. ఇంకా చెప్పాలంటే అసలు అక్కడ ఎలా ఉంటుందో తెలుసుకోవాలనే ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. శృంగారంలో పాల్గొనే సమయంలో చాలా ఆలోచనలు వస్తుంటాయి. అందులో కొన్ని మంచివి ఉంటాయి. కొన్ని చాలా ఇబ్బందికరమైనవి ఉంటాయి. ‘అతడికి నేను నచ్చానా?’, ‘నా శరీరం నుంచి దుర్వాసన రావడం లేదు కదా?’ అని ఎక్కువగా ఆలోచిస్తుంటారు. సెక్స్ నేను బాగా ఆస్వాదించే సమయంలో నా మెదడు పూర్తిగా బ్లాంక్ అయిపోతుంది. ఆ సమయంలో ఎలాంటి ఆలోచనలు రావు.