సెక్స్ తర్వాత నొప్పి, మంటగా ఉంటోందా..

శృంగారం చేసే ముందు చేసిన త‌ర్వాత శా‌రీర‌క శుభ్ర‌త అనేది చాలా ముఖ్యం. ప్రైవేట్ పార్ట్స్‌ని కూడా ఎప్ప‌టిక‌ప్పుడు శుభ్రం చేసుకోవ‌డం చాలా మంచిది. ఇలా క్లీన్ చేయ‌డానికి చాలా మంది ప్రైవేట్ పార్ట్స్ కోసం క్లీన‌ర్స్‌ని ఉప‌యోగిస్తున్నారు. మ‌రి వాటివ‌ల్ల వ‌చ్చే లాభ‌నష్టాల గురించి తెలుసుకుందాం. మెనోపాజ్ ముందూ, తరవాతా యోని పొడిబారటమన్నది సాధారణమైన విషయమే. కానీ, వయసుతో సంబంధం లేకుండా ఈ సమస్య ఎప్పుడైనా కనిపించొచ్చు. ఇటీవ‌ల ఈ స‌మ‌స్య చాలా మందిలో త‌లెత్తుతుంది. ఈస్ట్రోజెన్ స్థాయి తగ్గినప్పుడు యోని పొడిగా అవుతుంది. ఈ హార్మోన్ యోని లోపలి పొరని మందంగా, తడిగా, సాగే గుణంతో ఉంచుతుంది.

యోని పొడిబారటం అనేది స్త్రీ సెక్స్ లైఫ్ మీద బాగా ప్రభావం చూపుతుంది. దీనివల్ల మహిళలు రతి సమయంలో నొప్పినీ, అసౌకర్యాన్నీ ఎదుర్కొంటారు. ఈ సమస్యని ప‌ట్టించుకోకుండా చాలా మంది సెక్స్ చేస్తారు. దాని వ‌ల్ల త‌ర్వాత నొప్పి, మంట ఇన్‌ఫెక్ష‌న్ వ‌చ్చే ప్ర‌మాదం ఎంతైనా ఉంది. సాధారణంగా ఈస్ట్రోజెన్ స్థాయి తగ్గిపోయినప్పుడు ఈ సమస్య తలెత్తుతుంది. మెనోపాజ్ దగ్గర పడుతున్న కొద్దీ ఈస్ట్రోజెన్ స్థాయి తగ్గుతూ ఉంటుంది. ఈ హార్మోన్ వల్లే స్త్రీ శరీరపు ఆకృతీ, రొమ్ముల పెరుగుదల ఉంటాయి. రుతుచక్రంలోనూ, గర్భధారణలోనూ కూడా ఈస్ట్రోజెన్ హార్మోన్ కీ రోల్ పోషిస్తుంది. సెక్స్ చేసే ముందు యోని పొడిబారి ఉంటే ఆయిల్ పెట్టి చెయ్య‌డం వ‌ల్ల పెద్ద‌గా నొప్పి మంట లాంటివి ఉండ‌వు. వాటి నివారించ‌వ‌చ్చు. అలాగే సెక్స్ చేసే ముందు చేసిన త‌ర్వాత ప్రైవేట్ పార్ట్స్ ని శుభ్రం చేసుకోవ‌డం వ‌ల్ల ఎలాంటి ఇన్‌ఫెక్ష‌న్స్ ద‌రి చేర‌వు.