మనం మన జీవితంలో ఎంతో సంతోషంగా ఎలాంటి కష్టాలు లేకుండా అనారోగ్య సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉండాలని భగవంతుని పూజిస్తాము. ఇలా భగవంతుడిని పూజించే సమయంలో ఒక్కొక్కరు ఒక్కో విధంగా స్వామివారికి పూజ చేస్తూ ఉంటారు. అయితే ఇలా పూజలు చేసే సమయంలో ఎన్నో నియమాలను పాటించాలని లేకపోతే మనం చేసే పూజ వల్ల ఎలాంటి ఫలితాలు ఉండవని పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా భగవంతుని పూజించేటప్పుడు కొన్ని పొరపాట్లు అస్సలు చేయకూడదు. ఇలా చేయకూడని ఆ పొరపాట్లు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం…
మన హిందూ సంప్రదాయాల ప్రకారం ఏ దేవుడిని పూజించాలన్నా పూజ చేసే సమయంలో దీపం నీటి కుండను (కలశం) పక్కపక్కనే పెట్టకూడదు. దేవుడి ముందు మనం వెలిగించే దీపాలు ఎల్లప్పుడూ కూడా ఆగ్నేయ దిశలోనే ఉండాలి అలాగే మనం ఏర్పాటు చేసిన కలశం ఈశాన్య దిశలో ఉంచాలి. ఇక దేవుడికి పూజ చేసే సమయంలో వాడిపోయిన పుష్పాలను ఉపయోగించకూడదు.
మనం దేవుడికి సమర్పించే పుష్పాలలో కొన్ని పుష్పాలు నిషేధించబడ్డాయి. ఇలా నిషేధించబడిన పుష్పాలను ఉపయోగించడం వల్ల ఎలాంటి ఫలితాలు ఉండవు. ఇకపోతే దేవుడికి పూజించే సమయంలో భక్తిశ్రద్ధలతో మన మనసును దేవుడిపై ఉంచి పూజ చేయాలి. ఇక పూజ చేసే సమయంలో ఎలాంటి గర్వం లేకుండా భగవంతుడిని భక్తిశ్రద్ధలతో కొలచడం వల్ల భగవంతుడి కరుణ కటాక్షాలు కృప మనపై ఉంటాయి. భగవంతుడిని పూజించే సమయంలో ఆగ్రహం వ్యక్తం చేయకూడదు. ఇలా చేసినప్పుడు మనం చేసిన పూజకు ఫలితం వస్తుంది.