మనం చేసే వ్యాపారంలో సమస్యలు రాకుండా ఉండటానికి నిమ్మకాయలతో ఇలా చేస్తే సరి…?

సాధారణంగా నిమ్మ పండుని వంటలలో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. పురాణాల ప్రకారం శుభకార్యాలలో కూడా నిమ్మ పండుని శుభప్రదంగా భావిస్తారు. ఏదైనా కొత్త వాహనం కొనుగోలు చేసిన వ్యాపారం ప్రారంభించిన కూడా నిమ్మ పనులను కోసి ప్రధాన ద్వారం వద్ద పెడుతూ ఉంటారు. ఇలా చేయడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయని ప్రజల విశ్వాసం. అంతేకాకుండా నూతనంగా నిర్మించిన గృహాలకు దిష్టి తగలకుండా కూడా నిమ్మకాయలను ఇంటి గుమ్మం ముందు వేలాడదీస్తూ ఉంటారు. ఇలా చేయటం వల్ల ఇతరుల దిష్టి సోకకుండా ఉంటుంది.

అంతేకాకుండా అప్పుడప్పుడు మనుషులకు కూడా నరదిష్టి తగులుతూ ఉంటుంది. అలా దిష్టి తగలడం వల్ల ఆరోగ్య సమస్యలతో పాటు ఇతర సమస్యలు కూడా వేధిస్తూ ఉంటాయి. అలాంటి సమయాలలో నిమ్మ పండుతో ఏడుసార్లు దిష్టి తీసి తర్వాత దానిని నాలుగు ముక్కలుగా చేసి నిర్జీవ ప్రదేశంలో విసిరేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి చేరుకోవాలి. ఇలా చేయటం వల్ల దిష్టి మొత్తం తొలగిపోతుంది.

అలాగే కొన్ని సందర్భాలలో సవ్యంగా జరుగుతున్న వ్యాపారంలో అనుకోని సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. అలాంటి సమయాలలో ఐదు నిమ్మకాయల తో పాటు పిటికెడు ఆవాలు పసుపు ఎండుమిర్చి వేసి ఒక పసుపు రంగు వస్త్రంలో కట్టి దుకాణంలో ఉంచాలి. మరుసటి రోజు ఉదయం ఈ నిమ్మకాయలను నిర్జీవ ప్రదేశంలో పారవేయాలి. ఇలా చేయడం వల్ల కూడా దిష్టి తొలగిపోయి వ్యాపారంలో ఎదురయ్యే సమస్యలన్నీ కూడా తొలగిపోయి వ్యాపారంలో లాభాలు వస్తాయి.

అలాగే ఏదైనా కొత్త వాహనం కొనుగోలు చేసినా కూడా దిష్టి తగలకుండా నిమ్మకాయలతో పాటు కొన్ని పచ్చిమిర్చి దారానికి కుట్టి వాహనానికి కడుతూ ఉంటారు. అలాగే కొత్త వాహనాలను కొనుగోలు చేసినప్పుడు శుభం జరగాలని నిమ్మకాయను ఉంచి వాటి మీద వాహనాన్ని మొదటగా పోనిస్తు ఉంటారు.