రైల్వే స్టేషన్లో నేమ్ బోర్డ్స్ పసుపు రంగులో ఉండటానికి గల కారణం ఏమిటో తెలుసా..?

రైలు ప్రయాణం అంటే అందరికీ చాలా ఇష్టం. రైలు ప్రయాణాన్ని అందరూ ఎంతో ఇష్టంగా ఆస్వాదిస్తారు. కానీ ఎన్నిసార్లు రైల్వే స్టేషన్ కి వెళ్లిన అక్కడ కొన్నింటిని మనం చూసినప్పటికీ వాటి గురించి పెద్దగా పట్టించుకోము. ఇలా రైల్వేస్టేషన్లో మనం చూసినా కూడా పట్టించుకోని విషయం ఏమిటంటే రైల్వేస్టేషన్లో ఉన్న నేమ్ బోర్డ్స్ అన్నీ కూడా పసుపు రంగులో ఉంటాయి. అయితే రైల్వే స్టేషన్లో నేమ్ బోర్డ్స్ ఇలా పసుపు రంగులో ఎందుకు ఉంటాయి? దాని వెనుక అసలు కారణం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

సాధారణంగా ఎరుపు రంగుకు తరంగ దైర్ఘ్యం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఎరుపు రంగు వస్తువులు దూరంగా ఉన్నా కూడా మనం వాటిని తొందరగా గుర్తించవచ్చు. అందువల్ల ఎక్కడైనా ప్రమాద హెచ్చరికల గురించి తెలియజేయటానికి ఎరుపు రంగును ఉపయోగించి హెచ్చరికలు తెలియజేస్తూ ఉంటారు. ముఖ్యంగా రహదారులలో ఈ ఎరుపు రంగు హెచ్చరికలు ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు.
అయితే ఎరుపు రంగుతో పోలిస్తే, పసుపు రంగు తరంగ దైర్ఘ్యం కొంచం తక్కువగా ఉంటుంది. అయితే పసుపు రంగుకి కాంతి ఆకర్షణ గుణం ఎక్కువగా ఉంటుంది.

అందుకోసమే రైల్వే స్టేషన్లలో నేమ్ బోర్డ్స్ కి పసుపు రంగు వేస్తారు. పసుపు రంగు బోర్డు మీద నల్ల రంగుతో పేర్లు రాసి ఉంటాయి. పసుపు రంగు కాంతివంతంగా కనిపించడం వల్ల రైలు ఏ స్టేషన్ పరిధిలో ప్రయాణిస్తుందో లోకో ఫైలెట్ చాలా సులభంగా గుర్తించవచ్చు. అయితే పసుపు రంగు బోర్డుల మీద నల్లటి రంగుతో మాత్రమే పేరు రాసి ఉంటారు. అలా రాయడానికి కూడా ఒక కారణం ఉంది. పసుపు రంగు బోర్డు మీద నలుపు రంగు కాకుండా వేరే రంగుతో పేర్లు రాయడం వల్ల కాంతి పడినప్పుడు అది రిఫ్లెక్షన్ అవ్వదు. కానీ నలుపు రంగుకి రిఫ్లెక్ట్ అయ్యే గుణం ఉంటుంది. అందువల్ల రైల్వే స్టేషన్లలో పసుపు బోర్డుపై నల్లటి అక్షరాలతో రాసి ఉంటారు.