సాధారణంగా కొత్త ఇల్లు నిర్మించుకున్నప్పుడు ఇంటి ముందు, వ్యాపారం ప్రారంభించినప్పుడు దుకాణాల ముందు ఎవరి దిష్టి తగలకుండా దిష్టిబొమ్మలు కడుతూ ఉంటారు. రోడ్డుమీద వచ్చిపోయేవారు చూడటం వల్ల దిష్టి తగిలి అనేక సమస్యలు ఎదురవుతాయి. ఎందుకంటే ఈ నరదృష్టి చాలా ప్రమాదకరమైనది. నరదృష్టి పడితే నాపరాయి కూడా బద్దలవుతుంది అనే ఒక సామెత మనందరికీ తెలిసే ఉంటుంది. నరదిష్టి తగలడం వల్ల కుటుంబంలో కలహాలు మొదలయ్యి కుటుంబం అంతా అస్తవ్యస్తంగా మారిపోతుంది. ఇక వ్యాపారంలో కూడా నష్టాలు మొదలై ఆర్థిక సమస్యలతో సతమంతమవుతారు. ఏ మ్యారేజ్ దిష్టి వల్ల ఆర్థిక సమస్యలు మాత్రమే కాకుండా అనారోగ్య సమస్యలు కూడా మొదలవుతాయి.
అయితే కొన్ని చిట్కాలు పాటించటం వల్ల నరదృష్టిని తొలగించవచ్చు. సాధారణంగా చిన్నపిల్లలకు ఎక్కువగా దిష్టి తగులుతూ ఉంటుంది. ఎందుకంటే చిన్నపిల్లలు ముద్దుగా ఉండటం వల్ల ప్రతి ఒక్కరూ వారిని చూస్తూ ముద్దు చేస్తారు. ఇలా వారందరి దిష్టి తగిలి పిల్లలు నిత్యం ఏడవటం అన్నం తినకుండ ఉంటారు . ఇలా నరదిష్టి తగిలిన రెండు మూడు ఎండుమిరపకాయలు కొంచెం ఉప్పు తీసుకొని వాటితో దిష్టి తీసి ఆ తర్వాత నిప్పుల్లో వేస్తారు. ఇలా చేయటం వల్ల దిష్టి మొత్తం తొలగిపోతుంది.
అలాగే ఇళ్లకు దుకాణాలకు దిష్టి తగలకుండా ఉండటానికి వాటి ముందు దిష్టిబొమ్మలను తగిలిస్తారు. అంతే కాకుండా ఎండుమిరపకాయలు, నిమ్మకాయలు కలిపి ఒక దారానికి గుచ్చి వాటిని గుమ్మం ముందు వేలాడదీస్తారు. ఇలా చేయటం వల్ల మనుషుల దిష్టిని అవి ఆకర్షిస్తాయని మన పెద్దలు చెబుతున్నారు. అలాగే నరదిష్టి వల్ల కుటుంబంలో సమస్యలు తగ్గకపోతే ఒక నిమ్మకాయ రెండు ముక్కలుగా కోసి ఒకదానిని పసుపు ఇంకొక మొక్కను కుంకుమలో ముంచి వాటిని ప్రధాన ద్వారం కి ఇరువైపులా ఉంచాలి . ఇలా చేయటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. నరదిష్టి వల్ల ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలతో బాధపడేవారు వినాయకుడి గుడికి వెళ్లి అక్కడ పూజలు చేయించడం వల్ల ఆ నరదిష్టి నుండి ఉపశమనం లభిస్తుంది.