మన భారతీయ సంస్కృతిలో వివాహానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ప్రతి మనిషి జీవితంలో వివాహం అనేది చాలా ముఖ్యమైన ఘట్టం. అందువల్ల తల్లిదండ్రులు తమ పిల్లలకు సరైన జోడి చూసి వివాహం చేసి తమ బాధ్యత నెరవేర్చుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే ప్రస్తుత కాలంలో యువతీ యువకులు చదువు ఉద్యోగం అంటే 30 సంవత్సరాలు దాటినా కూడా వివాహానికి ముగ్గు చూపటం లేదు. వివాహం ఆలస్యం అవటానికి ఇదొక కారణం అయితే జాతక దోషం వల్ల కూడా కొంతమంది వివాహానికి సిద్ధమైన తర్వాత కూడా అనేక ఆటంకాలు ఎదురవుతూ వివాహం ఆలస్యం అవుతూ ఉంటుంది. ఇలా ఎన్ని సంబంధాలు చూసిన ఆటంకాలు ఏర్పడి వివాహం అవుతుంటే ఓకే ఒక పరిష్కారం ఉంది.
యువతీ యువకులు పెళ్లి చేసుకోవడానికి సిద్ధమే ఎన్ని సంబంధాలు చూసినా కూడా ఏదో ఒక ఆటంకం వల్ల వివాహం ఆగిపోతూ ఉంటుంది. మరి కొంతమందికి పీటలు దాకా వచ్చిన పెళ్లిళ్లు కూడా ఆగిపోతూ ఉంటాయి. అయితే ఇలా వివాహ విషయంలో ఆటంకాలు ఏర్పడి ఇబ్బంది పడుతున్న యువతీ యువకులు పసుపు కొమ్ములతో ఈ చిన్న పరిహారం చేయటం వల్ల వివాహ ఘడియలు దగ్గరపడతాయని పండితులు చెబుతున్నారు. పెళ్లి కి ఆటంకాలు ఏర్పడి ఇబ్బంది పడుతున్న యువతులు ప్రతి రోజూ ఉదయం నీటిలో కాస్త పసుపు వేసుకుని స్నానం చేయాలి. ఆ తర్వాత 108 పసుపు కొమ్ములతో కాళీ పస్యవ్య వదనం భర్తహుః శశిధర ప్రభమం సమదృష్టిః భూత్వా కురిశ్వాగ్ని ప్రదక్షిణం.. అనే మంత్రాన్ని పఠిస్తూ అమ్మవారికి అర్చన చేయడం వల్ల వివాహానికి ఉన్న దోషం తొలగిపోతుంది.
ఇక అబ్బాయిలు కూడా ఇలా వివాహాం ఆలస్యం అవుతుంది చింతిస్తుంటే వారు కూడా ప్రతిరోజు స్నానం చేసే నీటిలో కొంచెం పసుపు వేసుకొని ఆ నీటితో స్నానం చేయాలి. ఆ తర్వాత ఇంటి పూజ గదిలో లేదా ఏదైనా దేవాలయానికి వెళ్లి ఓం కామేశ్వరాయ నమః అనే మంత్రాన్ని పఠించాలి. ఇలా చేయటం వల్ల జాతకంలో ఉన్న దోషాలు తొలగిపోయి వివాహ గడియలు సమీపిస్తాయి.