చేపట్టిన పనులలో ఆటంకాలు వస్తున్నాయా.. తులసి వేర్లతో ఇలా చేస్తే విజయం మీదే?

సాధారణంగా మన హిందూ సాంప్రదాయాల ప్రకారం తులసి మొక్కను ఎంతో పవిత్రమైన మొక్కగా భావిస్తాము. అందుకే ప్రతి ఒక్క ఇంటి ఆవరణంలో తులసి మొక్క మనకు దర్శనమిస్తుంది. తులసి మొక్క కేవలం ఆధ్యాత్మికపరంగా మాత్రమే కాకుండా ఆరోగ్యపరంగా కూడా ఎన్నో ప్రయోజనాలను కలిగి ఉంది. ఆధ్యాత్మికపరంగా పవిత్రంగా భావించడం వల్ల తులసి మొక్కకు ప్రతిరోజు పెద్ద ఎత్తున పూజా కార్యక్రమాలను నిర్వహిస్తుంటారు.ఇకపోతే తులసి మొక్క మన ఇంటి ఆవరణంలో ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఉండటం వల్ల మన ఇంటి పై అనుకూల వాతావరణ పరిస్థితులు ఏర్పడతాయి.

ఇక చాలామంది ఎన్నో ముఖ్యమైన పనులలో విజయం సాధించలేక అపజయం పొందుతూ ఉంటారు ఇలా చేపట్టిన ప్రతి పని విజయవంతం కాకపోవడంతో చాలామంది నిరాశ వ్యక్తం చేస్తారు.అయితే మనం చేపట్టిన పని ఎంతో విజయవంతంగా పూర్తి కావాలంటే తులసి మొక్క వేర్లు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి.తులసి మొక్క వేర్లను గంగాజలంతో శుభ్రంగా కడిగి వాటికి పూజ చేసిన అనంతరం పసుపు రంగు గుడ్డలో ఆ పేర్లను కట్టి మన ఇంట్లో పవిత్రమైన చోట పెట్టడం వల్ల చేపట్టిన పనులు విజయవంతం అవుతాయి.

ఇక ఆర్థిక ఇబ్బందులతో సతమతమయ్యేవారు ప్రతిరోజు తులసి మొక్కకు ఉదయం నీరు పోసి సాయంత్రం దీపారాధన చేయటం వల్ల ఆర్థిక ఇబ్బందుల నుంచి బయట పడవచ్చు. ఇక గ్రహ దోషం కారణంగా కొంతమంది ఏ పని చేపట్టిన అపజయం అవుతుంటారు. ఇలాంటివారు తులసి వేర్లను వెండి తాయత్తులో పెట్టి కట్టుకోవటం వల్ల గ్రహదోషం తొలగిపోతుంది. ఇక మనం పని చేసే చోట మన ఇంటిలో నెగిటివ్ ఎనర్జీ లేకుండా ఉండాలంటే తులసి మొక్క వేర్లను ఒక కట్టలాగ కట్టి ఒక గ్లాసులో నీటిని వేసి ఇంటి ప్రధాన ద్వారం లేదా ఆఫీస్ టేబుల్ పై పెట్టడం వల్ల నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది.