పొరపాటున కూడా తులసి మొక్క వద్ద ఈ వస్తువులు ఉంచితే సమస్యలు తప్పవు…?

హిందూ సనాతన ధర్మంలో తులసి మొక్కను పరమ పవిత్రంగా భావిస్తారు. లక్ష్మీదేవి ప్రతిరూపంగా భావించి ప్రతిరోజు ఇంట్లో తులసి మొక్కను పూజిస్తూ ఉంటారు. ఇలా ప్రతిరోజు తులసి మొక్కను పూజించటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని ప్రజల విశ్వాసం. అయితే కొన్ని సందర్భాలలో మనకి తెలియకుండా తులసి మొక్క వద్ద కొన్ని వస్తువులు పెడుతూ ఉంటారు. ఇలా వాటినే ఉంచటం వల్ల ఇంట్లో ప్రతికూల శక్తి ఏర్పడి అనేక సమస్యలు ఎదురవుతాయి. తులసి మొక్క వద్ద ఏ వస్తులను ఉంచకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

• వాస్తు ప్రకారం ప్రతి ఇంట్లో తూర్పు దిశగా తులసి మొక్క పూజిస్తారు. అయితే తులసి మొక్కతో పాటు కొన్నిరకాల మొక్కలను కూడా తూర్పు దిశగా పెంచుతూ ఉంటారు. అయితే ముళ్ళతో కూడిన మొక్కలు తులసి మొక్క తోపాటు ఉంచటం వల్ల అనేక సమస్యలు ఎదురవుతాయి. ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవి ఆగ్రహానికి గురై ఆర్థిక సమస్యలు తలెత్తుతాయి.

• అలాగే తులసి మొక్క ఉంచిన ప్రదేశంలో చీపురుని కూడా ఉంచకూడదు. పరమ పవిత్రంగా పూజించి తులసి మొక్క వద్ద చీపురు ఉంచటం వల్ల ఇంట్లో ప్రతికూల శక్తి ఏర్పడుతుంది.

• తులసి మొక్క పూజింపబడుతున్న ప్రదేశంలో పొరపాటున చెప్పులు కూడా వదలరాదు. ఇలా చేయటం వల్ల ఇంట్లో అనేక సమస్యలు మొదలవుతాయి.

• అలాగే తులసి మొక్క దగ్గరలో చెత్తబుట్ట కూడా ఉంచకూడదు. ఇలా చెత్తబుట్ట ఉంచటం వల్ల ఇంట్లో ఆర్థిక సమస్యలతో పాటు ఆరోగ్య సమస్యలు కూడా మొదలై కుటుంబ సభ్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవల్సి వస్తుంది.

• అయితే తులసి మొక్క వద్ద చాలామంది శివలింగం ఉంచి పూజిస్తూ ఉంటారు. ఇలా తులసి మొక్కతో పాటు శివలింగం కూడా పూజించటం వల్ల అనేక సమస్యలు ఎదురవుతాయి. అందువల్ల పొరపాటున కూడా తులసి మొక్క వద్ద శివలింగం ఉంచి పూజించకూడదు.